కేసీఆర్, వైఎస్ మాట‌ను త‌ప్పుతున్నారా..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ys rajasekhar reddy and kcr
Updated:  2018-10-16 12:39:02

కేసీఆర్, వైఎస్ మాట‌ను త‌ప్పుతున్నారా..?

నిజం చెప్పులు ఏసుకునే టైం లో అబద్దం ఊరు అంత చుట్టి వచ్చింది అంట అలా ఉంది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హారం. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కేసీఆర్ వ‌రుస స‌భ‌లు, స‌మావేశాల‌తో సుడిగాలు ప‌ర్య‌ట‌న‌లు చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నేత‌లు, అభిమానులు కేరింత‌లు కొట్టేవారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మ‌న‌దేన‌ని విర్ర‌వీగేవారు. కానీ ఇప్పుడు ఏమైంది. పార్టీకి ప్ర‌మాద ఘ‌టింక‌లు మ్రోగిన‌ప్పుడు త‌న రాజ‌కీయ చ‌తురత‌కు ప‌దును పెట్టి ప్ర‌జ‌ల మెప్పు పొందేలా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ సైతం త‌న అర్ధ‌ర‌హిత వ్యాఖ్యాల‌కు బ‌లైపోయారు. ఉన్న‌ది పోయే..ఉంచుకున్న‌ది పోయే అన్న చందంగా త‌యారైంది కేసీఆర్ ప్ర‌సంగ శైలి. 
 
కేసీఆర్..! క‌ర‌డు గ‌ట్టిన తెలంగాణ వాది. అంతకంటే ఓ పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుడు. ప్ర‌జ‌ల‌కు ద‌శా - నిర్ధేశం చేసే ప‌రిపాల‌న ద‌క్ష‌కుడు మ‌రి అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, కాంగ్రెస్ పార్టీ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ సీమాంధ్ర ఓట్ల‌ను పోగొట్టుకుంటున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ లో ఉండే సీమాంధ్రుల ఓట్ల‌నే త‌మ‌కేనని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేత‌లు కేసీఆర్ ప్ర‌సంగం పై బిక్క‌చ‌చ్చిపోతున్నారు. 
 
ఎన్నిక‌ల్లో గెలుపొందాలంటే డ‌బ్బు, ప‌ర‌ప‌తి ఉంటే చాల‌దు. స‌మ‌యానికి అనుగుణంగా మాట్లాడే  వాక్చాతుర్యం ఉండాలి. ఎలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌నైనా సైతం మ‌న‌కు అనుగుణంగా మార్చుకోవాలం