పార్టీలో చేరిన కొద్ది రోజుల‌కే దానంకు షాక్ ఇచ్చిన కేసీఆర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and danam nagendar
Updated:  2018-08-22 04:16:43

పార్టీలో చేరిన కొద్ది రోజుల‌కే దానంకు షాక్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టినుంచి కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ సైలెంట్ గానే ఉన్నారు. తాను ఏదో ఒక రోజు టీఆర్ఎస్ లో చేర‌డం ఖాయం అని భావించినప్ప‌టికి ఆయ‌న పార్టీలో చేరేస‌రికి ద‌రిదాపు నాలుగు సంవ‌త్స‌రాలు పట్టింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో కొన్నాళ్లు తెలంగాణ ఏర్పాటుకు వ్య‌తిరేకంగా దానం చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపాయి. 
 
దీంతో అప్ప‌ట్లో దానంకు తెలంగాణ వ్య‌తిరేకిగా ముద్ర ప‌డింది. అయితే తెలంగాణ ఏర్పాటు ఖాయం అని తేలాక ఆయ‌న మెల్ల‌గా స్వ‌రం మార్చుకున్నారు. ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు దానం ఎక్క‌డున్నారో తెలియ‌ని ప‌రిస్థితి. ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీలో స‌రైన గుర్తింపు ఉండ‌క‌పోవ‌డం, గ్రేట‌ర్ లో కొన్ని ప్రాంతాల‌ను వేరుచేసి ఆయ‌న‌కు అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లను ఇవ్వ‌డంతో గ్రూప్ రాజ‌కీయాల‌తో దానం విసిగిపోయారు. 
 
ఇక చివ‌ర‌కు బీసీల‌కు కాంగ్రెస్ లో ప్ర‌ధాన్యం లేద‌నే నినాదంతో కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలు న‌చ్చి తాను టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో  పార్టీ కండువా క‌ప్పుకున్నారు దానం. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009లో దానం నాగేంద‌ర్ గెలిచి వైఎస్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత రోశ‌య్య క్యాబినెట్ లోను మంత్రిగా కొన‌సాగారు. 1994,99, 2004 ఎన్నిక‌ల్లో ఆసీఫ్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసి గెలిచారు దానం. ఇక నియోజ‌క‌వ‌ర్గాల‌న పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఖైర‌తాబాద్ ను ఎంచుకుని దానం సొంత నియోజ‌క‌వ‌ర్గంగా భావించారు. 
 
ఇప్పుడు దానం టీఆర్ఎస్ లో చేర‌డంతో అక్క‌డ సీటుకోసం పోటీ నెల‌కొంది. ఇక పీఆర్సీ నుంచి పోటీ చేసి ఓడిన పీజే ఆర్ కూతురు విజ‌యా రెడ్డి ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో కార్పోరేట‌ర్. అలాగే మ‌న్నె గోవ‌ర్ధ‌న్ రెడ్డి కూడా ఖైర‌తాబాద్ సీటుకోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక మ‌న్నె భార్య కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో కార్పోరేట‌ర్. దానం టీఆర్ఎస్ లో చేరిన ప‌రిస్థితి ఏమోగాని ఇప్పుడు మాత్రం అధిష్టానం ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 
 
గోషామ‌హ‌ల్ అసెంబ్లీ ప‌రిధిలో ప‌నిచేసుకోవాల‌ని దానం నాగేందర్ కు టీఆర్ఎస్ అధిష్టానం సూచించింద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ ఎవ్వ‌రు బ‌ల‌మైన నేత‌లు లేర‌ని హైద‌రాబాద్ లో ఆ నియోజ‌క‌వర్గం ఎంతో కీల‌కమైన‌ద‌ని చెబుతోంద‌ట‌. అయితే ప్ర‌స్తుతం గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి ముఖేష్ గౌడ్ పై 50వేల‌కు పైగా ఓట్ల‌తో గెలిచారు. అయితే ఈ సారి రాజాసింగ్ ఎంపీగా పోటీ చెయ్య‌లాని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఈ మ‌ధ్య‌కాలంలో బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఇండిపెండెంట్ గా భ‌రిలో దిగే ఛాన్స్ ఉంది. గోషామ‌హ‌ల్లో టీఆర్ఎస్ ఇంచార్జ్ గా ఉద్య‌మ స‌మ‌యం నుంచి మ‌హేంద‌ర్ ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం ఆర్థికంగా బ‌లంగా లేక‌పోవ‌డంతో 2014లో టీఆర్ఎస్ త‌ర‌పున ప్రేమ్ సింగ్ కు వ్య‌తిరేకంగా పోటీ చేశారు. ఈ మ‌ధ్య రెండు సార్లు గెలిచిన ప్రేమ్ సింగ్ రాథోడ్ కూడా టీఆర్ఎస్ చేరి కార్పోరేష‌న్ చైర్మ‌న్ అయ్యారు. అయితే ఇప్పుడు బ‌ల‌మైన నేత‌గా ఉన్న బీసీ దానం నాగేంద‌ర్ కు ఇక్క‌డ‌నుంచి పోటీ చేయించాల‌ని టీఆర్ఎస్ పెద్ద‌లు నిర్ణ‌యించార‌ట‌. 
 
కానీ దానం మాత్రం ఖైర‌తబాద్ నే అడుగుతున్నారు. అదీకుద‌ర‌క పోతే సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇవ్వాల‌ని కోరుతున్నార‌ట‌. అయితే ఈ రెండు నియోజ‌వ‌క‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసుకున్న అధిష్టానం దానంను గోషామ‌హ‌ల్ నుంచి పోటీకి రెడీ కావ‌ల‌ని ఆదేసించింద‌ట‌. అయితే ఇక్క‌డ దానం కు పెద్ద చిక్కే వ‌చ్చిప‌డింది. గోషామ‌హ‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున భ‌రిలో ఉండేది ముఖేష్  గౌడ్.
 
దానం, ముఖేష్ ఇద్ద‌రు బీసీ బ‌ల‌మైన నేత‌లే కాదు అత్యంత స‌న్నిహితులు కూడా, ఓ ద‌శ‌లో ముఖేష్ కూడా టీఆర్ఎస్ లోకి వ‌స్తార‌నే ప్ర‌చారం సాగింది. కానీ అదిజ‌రుగ‌లేదు. ఇక మ‌రోప‌క్క హాసిఫ్ న‌గ‌ర్ లోని కొన్ని డివిజ‌న్లు గోషామ‌హ‌ల్లోకి మార‌టం కూడా గులాభీ అధిష్టానం దానంను అక్క‌డికి వెళ్ల‌మ‌న‌టానాకి మ‌రో కార‌ణం అట‌. అయితే ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ నియోజ‌క‌వ‌ర్గం దానంకు త‌ల‌నొప్పిగానే మారింద‌ట‌. ముఖేష్ టీఆర్ఎస్ లోకి  వ‌చ్చి వుంటే త‌న‌కు బాద ఉండేది కాద‌ని ఆయ‌న స‌న్నిహితుల‌తో చెబుతున్నార‌ట‌. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.