ఫిరాయింపునేత‌కు కేసిఆర్ షాక్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-20 04:32:48

ఫిరాయింపునేత‌కు కేసిఆర్ షాక్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయాల్లో ఆరితేరిన‌టువంటి వ్య‌క్తి.... దూర దృష్టితో ఆలోచ‌న చేయ‌డం కేసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య‌.  ముందుచూపుతో ప‌ద‌వుల‌ను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి,  ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఉద్య‌మించారు కేసిఆర్‌. ఉద్య‌మంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న టీఆర్ెస్ పార్టీ,  త‌ర్వాత జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 
అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సిఎం కేసిఆర్ ప‌రిపాల‌న‌, ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌తను చూసిన ఇత‌ర పార్టీ నాయ‌కులు టిఆర్ ఎస్ లో  చేరారు. నాయకుల చేరిక‌ల‌ను ప్రోత్సాహించిన కేసిఆర్ ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లం లేకుండా చేశారు. పార్టీలో చేరినవారందరికీ సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన‌ సీఎం కేసీఆర్ దాన్ని నెర‌వేర్చ‌లేదు. పార్టీ మారి వ‌చ్చిన నాయ‌కుల‌కు త‌గిన  ప్రాధాన్యం క‌ల్పించ‌క‌పోయినా  టీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ లేదనే పరిస్థితిని తీసుకొచ్చారు కేసీఆర్. దీంతో పార్టీ మారిన‌ నాయ‌కుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏమిట‌న్న‌ది ఇప్పుడు  ప్ర‌శ్నార్ద‌కం అయింది.
 
భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టిఆర్‌య‌స్ నేత, ప్ర‌స్తుత స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసిఆర్‌తో భేటీ అయి ఈ సారి కూడా టికెట్ ఇవ్వాలని కోరగా అందుకు ఆయన సుముక‌త చూపిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయ‌కుడు గండ్ర సత్యనారాయణరావు పార్టీ మారి టీఆర్ఎస్ లో  చేరారు. త‌న‌కే టికేట్ వ‌స్తుంద‌ని ఆశించిన ఈ నాయ‌కుడికి గులాబి బాస్ షాక్ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.