కేసీఆర్ వ్యూహం ఎలా ఉండ‌బోతోంది ?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr image
Updated:  2018-03-05 04:15:02

కేసీఆర్ వ్యూహం ఎలా ఉండ‌బోతోంది ?

2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి KCR  తాను మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తానని అవసరం అయితే తానే నాయకత్వం వహిస్తానని ప్రకటన చేశారు.  BJP కాంగ్రెస్ దేశాన్ని సరిగ్గా పాలించలేదని విధానాలను సమూలంగా మార్చివేయాలని సైతం మాట్లాడుతున్నారు. KCR  ప్రకటనతో రాజకీయాలు కీలక దశకు చేరుకుంటున్నాయి. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ప్రాతిపధిక వారు మాట్లాడుతున్న విదానాలా లేదా 2019 ఎన్నికలా అన్న కోణంలో కచ్చితమైన  పరిశీలన జరగాలి.
 
KCR ప్రకటనకు మూలం మారుతున్న దేశ రాజకీయ పరిణామాలే......
 
KCR కీలక ప్రకటనకు మూలం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలే మూలంగా కనిపిస్తుంది. 2014 ఎన్నికలలో  BJP అద్బుత విజయాన్ని నమోదు చేసింది. దానికి రెండు కారణాలు 1. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత 2. మోదీ మీద ఉన్న నమ్మకం గడిచిన 4 సంవత్సరాలను పరిశీలిస్తే  కాంగ్రెస్ మీద అనుకూలం లేకపోయినా నాటి వ్యతిరేకత ఉండదు ( ఆంద్రప్ర‌దేశ్ మినహయింపు). మోదీ మీద నాడు ఉన్న నమ్మకం తగ్గిందే తప్ప పెరిగింది లేదు. 2014 ఎన్నికలలో  BJP మంచి విజయాన్ని సాధించింది  కేవలం ఉత్తరప్రదేశ్, మధ్య‌ప్రదేశ్, రాజస్దాన్, గుజరాత్,మహరాష్ట్ర,బీహర్, దిల్లీ లాంటి 7 రాష్ట్రాలలో వచ్చిన ఏకపక్ష విజయాలే కారణం. ఆ పార్టీ సాధించిన 282 స్దానాలలో 201 స్దానాలు ఇక్కడివే. 2014 తర్వాత జరిగిన ఎన్నికల ఫ‌లితాలను పరిశీలిస్తే  బీహర్, మధ్య‌ప్రదేశ్, రాజస్దాన్, డిల్లీ లో ఓడిపోయింది. గుజరాత్ లో గణ‌నీయంగా తగ్గింది. మొత్తం జరిగిన పరిణామాలు చూస్తే  దాదాపు 70-80 స్దానాలు తగ్గే అవకాశం ఉంది. 
 
మరో కీలక విషయం ఆ స్దానాలలో కాంగ్రెస్ కు అవకాశం ఉంటుంది. అంటే  BJP  282 నుంచి 200 కు తగ్గితే కాంగ్రస్ 40 నుంచి 100 స్దానాలను దాటనుంది. బెంగాల్, కేరళ,తమిళనాడు, ఉభ‌య తెలుగు రాష్ట్రాలలో గతానికి నేటికి  BJP కి వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు, మిగిలిన రాష్ట్రాలలో కూడా  BJP వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు సరికదా పంజాబ్ లాంటి చోట్ల కాంగ్రెస్ పుంజుకుంది. మొత్తంగా ప‌రిశీలిస్తే  జాతీయ పార్టీలు అయిన  BJP కి 200 లోపు కాంగ్రెస్ కు 150 లోపు వచ్చే పరిస్దితులు కనిపిస్తున్నాయి. అంటే రెండు పార్టీలకు సరిపడ సీట్లు రావు.
 
పుంజు కుంటున్న ప్రాంతీయ పార్టీలు......
 
దేశ పరిస్దితులు అలా ఉంటే పలు రాష్ట్రాలలో ప్రాంతీయ  పార్టీలు ఈ కాలంలో పుంజుకున్నాయి. బెంగాల్ లో మమత, బీహర్ లో లాలూ, తమిళ నాడులో  DMK లేదా రజినీ, తెలంగాణలో KCR, ఏపీలో  TDP లేదా  YCP లు, ఒడిస్సాలో నవీన్, ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి లేదా అకిలేష్  కు గతంలో కన్నా ఎక్కువ స్దానాలు వస్తాయి. దాదాపుగా 150 స్దానాలు కు పైగా ప్రాంతీయ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది. రెండు జాతీయ పార్టీలకు 150 , 200 దాకా స్దానాలు వస్తే  ప్రాంతీయ పార్టీలకు 150 దాకా వస్తాయి. అలా 2019లో ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశం వస్తుంది.
 
బహుముఖ వ్యూహంతో KCR అడుగులు......
 
KCR ఒక్కసారిగా కాంగ్రెస్ ,  BJP లకు వ్యతిరేక కూటమి వైపు అడుగులు ఎందుకు వేసినట్లు అవకాశం వస్తే  ప్రధాని అయిపోదామనా అనుకుంటే?  అది పొరబాటు తెలంగాణలో తన పార్టీని గెలిపించే వ్యూహం తప్ప మరోటికాదు. ఈ మధ్య  కాలంలో నే అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్బంగా చాలా కీలక ప్రకటన చేశారు.. KCR.  BJP కి తెలంగాణలో అవకాశం లేదు అని అధికారంలోకి రావడం అంటే ఆటలు కాదని అయినా నాకూ ప్రధాని కావాలని ఉంది అయిపోతానా అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి ఇపుడు వారే ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తాను అనడం వెనకు తెలంగాణ రాజకీయ అవసరాలు తప్ప మరోటికాదు. 
 
తెలంగాణలో KCR కి కాంగ్రెస్ ప్రధాన శత్రువు అయితే  BJP  కూడా రాజకీయ ప్రత్యర్దే. అందుకే మూడవ ప్రంట్ మాట. దేశం రెండు జాతీయ పార్టీలకు అవకాశం రాకపోతే కచ్చితంగా ఒక అవకాశం ప్రాంతీయ కూటమికి ఉంటుంది. అలా ప్రధాని అయ్యే అవకాశం మమత, మాయావతి, శరద్ పవార్, నవీన్, బాబు, అవకాశం ఉంటే KCR కి ఉంటుంది. ఇదే ప్రచారం తెలంగాణలో జరిగితే పీ వీ తర్వాత తెలంగాణ బిడ్డకు ప్రధాని అయ్యే అవకాశం మల్లీ KCR రూపంలో వస్తుంది. అని సెంటి మెంట్ రాజకీయాలు నడపవచ్చు... 2014లో తెలంగాణ సెంటిమెంట్ గెలిపిస్తే నేడు ప్రధాని అవకాశం ఉపయోగపడకపోతుందా అన్న ఆశ KCR ది గా కనిపిస్తుంది.
 
అలా తెలంగాణలో మంచి విజయం సాధించడానికి 2014 నుంచి నేటివరకు సాగిన తన పాలన కన్నా మూడవ ముచ్చట మంచి ఫ‌లితాలను ఇస్తుందన్న వ్యూహంగా కనిపిస్తుంది. కానీ నేటి వరకు వరుసగా కేంద్రాన్ని బలపరిచి నేడు వారికి మేం వ్యతిరేకం అంటే ప్రజలు నమ్ముతారా, ఒకటా రెండా నోట్ల రద్దు, జీ యస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రతి సారీ  BJP ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచిన KCR అనేక సందర్బాలలో రాష్ట్ర  BJP నేతలను విమర్శించిన KCR ఒక్క మాట కూడా మోదీని అనలేదు. మరి ఇపుడు వారు నిర్మించే ప్రత్యామ్నాయం కు ప్రాతిపదిక ఉందా కచ్చితంగా KCR కి ఉన్న ప్రాతిపదిక తెలంగాణలో తనకు ప్రయోజనం కలగడమే.  
 
2019లో కేంద్రంలో రెండు జాతీయ పార్టీలలో ఒకరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే  కచ్చితంగా ఇదే KCR అనే మాట కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య  మంచి సంబందాలు ఉండాలి కాబట్టి తాము మద్దతు ఇస్తాం అంటారు. అలా తన ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయం మన జాలదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.