ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌తో కేసీఆర్ ప‌ద‌విని కోల్పోతారా..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-09-03 01:18:33

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌తో కేసీఆర్ ప‌ద‌విని కోల్పోతారా..?

సెంట్ మెంట్ ను బాగా న‌మ్మే సీఎం కేసీఆర్ ఈసారి అభిమానుల్ని అయోమ‌యానికి గురిచేసిన‌ట్లు తెలుస్తోంది. ఆదివారం ఇంబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం కొంగ‌ర కలాన్ లో ప్ర‌గ‌తి నివేద‌న పేరుతో టీఆర్ఎస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తుంది. 200ఎక‌రాలు రూ.300కోట్ల ఖ‌ర్చు, 25ల‌క్ష‌ల మంది టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌తో ఆ ప్రాంతం అంతా గులాబీ మ‌యం అయ్యింది . ఈ నేప‌థ్యంలో కొంగ‌ర‌కొలాన్ స‌భ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.
 
గ‌తంలో హెమాహెమీలు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ‌లు నిర్వ‌హించిన అనంత‌రం ప‌ద‌వుల్ని పోగొట్టుకున్నారు. మ‌రికొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మ‌రి ఇంత జ‌రిగినా కేసీఆర్ అక్క‌డే ఎందుకు స‌భ నిర్వ‌హిస్తున్నారు. క‌టౌట్ ఉంటే కంటెంట్ అక్క‌ర్లేద‌ని ధోర‌ణిలో ఉన్నారా..? ఏ ధోరిణిలో ఉన్నా రాబోయో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంద‌నేది ప్ర‌తీ ఒక్క‌రు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
మ‌రికొద్ది సేప‌ట్లో కొంగ‌ర కొలాన్ లో టీఆర్ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ప్రారంభం కానుంది.
 
ఈ స‌భ‌లో అనేక రాజ‌కీయ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ స‌భ‌పై అంచ‌నా వేస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ నిర్వహించిన మాజీ ముఖ్య‌మంత్రుల‌కు ఏ గ‌తిప‌ట్టిందో చూడండి అంటూ పుంకాలు పుంకాలుగా క‌థ‌నాల్ని వ‌డ్డి వారుస్తున్నారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయ ఉద్దండుల‌ను చిమ్మిచీక‌ట్ల‌లోకి నెట్టిన ప్రాంతం. ఎంతటి మ‌హామ‌హులైనా ఆ ప్రాంతంలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించిన ..కొద్ది రోజుల్లో వారి ప‌త‌నం ప్రారంభం అవుతోంది. అలా ముఖ్య‌మంత్రులు అంజ‌య్య‌, వైఎస్ రాశేఖ‌ర్ రెడ్డి, రోశ‌య్య,కిర‌ణ్ కుమార్ ల ప‌తనానికి ఇక్క‌డే బీజం ప‌డింది.
 
గ‌తంలో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలే ధ్యేయంగా మ‌హేశ్వ‌రంలో జంబో కెబినేట్ తో బ‌స్ లో  అంజ‌య్య మ‌హేశ్వ‌రం మండ‌లం తుక్కుగుడాలో స‌భ నిర్వ‌హించారు. ఆ స‌భ నిర్వ‌హించిన స్థ‌లం మ‌హిమ ఏంటో తెలియ‌దు గాని ఆరునెల‌ల్లో ఆయ‌న ప‌ద‌విని పోగొట్టుకున్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వాలనే ఉక్కు సంక‌ల్పంతో మ‌హేశ్వ‌రం మండ‌ల కేంద్రం నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఆ ఎన్నిక‌ల్లో గెలిచి విజ‌యం సాధించారు. ఆ త‌రువాత కొద్ది కాలానికి  జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. 
 
వైఎస్ మ‌ర‌ణం త‌రువాత సీఎం బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోశ‌య్య మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మొక్క‌లు నాటి ప‌ద‌వి పోగొట్టుకున్నారు. రోశ‌య్య ప‌ద‌వికి రాజీనామా చేసిన అనంత‌రం బాధ్య‌త‌లు చేప‌ట్టిన న‌ల్లారి  కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌హేశ్వ‌రంలో స‌భ నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డ‌డంతో ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేసి స‌మైఖ్యాంధ్ర‌పేరిట పార్టీ పెట్టి అభాసుపాల‌య్యారు. 
 
 
ఇలా చెప్పుకుంటూ పోతే పొలిక‌ల్ వ‌ర్గాల్లో మ‌హేశ్వ‌రం  నియోజ‌క వ‌ర్గం అంటే ఓ మాయ‌ని మ‌చ్చ‌. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ నిర్వ‌హిస్తుంది అదే నియోజ‌క‌వ‌ర్గంలోనే. అయితే సెంటిమెంట్ ను మార్చిన కేసీఆర్ ఈ స‌భ 
 మ‌హేశ్వ‌ర నియోజ‌వ‌క‌ర్గంలో జ‌రుగుతుంద‌ని కాకుండా ఇబ్ర‌హిం ప‌ట్నంలో జ‌రుగుతుంద‌నేలా ప్ర‌చారం చేశారు.
మ‌రి ఈ స‌భ త‌రువాత టీఆర్ఎస్ పార్టీలో ఏం జ‌రుగుతుంద‌నేది రాజ‌కీయ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.