ఢిల్లీలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telanagana cm kcr
Updated:  2018-08-25 11:52:20

ఢిల్లీలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై రాష్ట్ర‌మంత‌టా ఉత్కంట నెల‌కొంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర ప్రభుత్వ వ‌ర్గాల నుంచి మ‌రింత స్ప‌ష్టత తీసుకోవ‌డం కోసం ఆయ‌న హ‌స్తిన‌లో అడుగు పెట్టిన‌ట్లుగా స్ప‌ష్టం అవుతోంది. అయితే వాస్త‌వానికి ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం అసెంబ్లీని ర‌ద్దుచేసిన త‌ర్వాత వెంట‌నే సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే రాష్ట్రంలో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దని భావించారు. 
 
అలా కాకుండా సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు వాయిదా వేస్తే అప్ప‌టిదాక ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం కొన‌సాగించ‌వ‌ల్సి ఉంటుంది. ఇక ఈ విష‌యంపైనే మ‌రింత స్ప‌ష్ట‌త కోసం ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో పాటుగా ప‌లువురు కేంద్ర మంత్రులతో కూడిన‌ కీల‌క వ్య‌క్తుల‌ను  ఆయ‌న క‌లువ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. తాము రూపొందించిన వ్యూహం ప్ర‌కారం ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌డానికి ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం కొన‌సాగ‌డానికి ఎంత‌వ‌ర‌కు అవ‌కాశాలు ఉన్నాయి. 
 
అనుకూల ప్ర‌తికూల‌తల అంశాల‌పై  కేసీఆర్ దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు నూత‌న జ‌ర్న‌ల్ వ్య‌వ‌స్థ‌కు  ఆమోద ముద్ర ర‌క్ష‌ణ శాఖ భూముల కేటాయింపు, రాష్ట్ర విభ‌జ‌న హామీల్లో భాగం అయిన బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం, కేంద్ర విద్యా సంస్థ‌ల ఏర్పాటు తదిత‌ర అంశాల‌పై కూడా ప్ర‌ధాన మంత్రితో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామ‌కాల జారీకి నూత‌న జ‌ర్న‌ల్ వ్య‌వ‌స్థ‌కు ఆమోద ముద్ర ప‌డ‌టం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండ‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.