కేసీఆర్ ఆప‌రేష‌న్ కొండంగల్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr and revanth reddy
Updated:  2018-08-28 03:40:22

కేసీఆర్ ఆప‌రేష‌న్ కొండంగల్

గుర్తుపెట్టుకో. టీఆర్ఎస్ కంటే తోపెవ‌డు లేడిక్క‌డ.నీకు ఏద‌నిపిస్తే అది చేయ్. కాంగ్రెస్  మాట‌వినొద్దు. రేవంత్ మాట‌ అస‌లు వినొద్దు. మీ టార్గెట్ ముంద‌స్తు ఎన్నిక‌లైతే  అయితే ఎయిమ్ ఫ‌ర్ రేవంత్ రెడ్డి . బిజినెస్ మాన్ సినిమాల్లో డైలాగుల్లానే ఉన్నాయి. కానీ ఎక్క‌డో తేడా కొడుతోంది క‌దూ..!నిజ‌మే ఆ సినిమాలో మ‌హేష్ బాబుకోసం పూరి జ‌గ‌న్నాథ్ రాసిన డైలాగులే..!
 
అయితే  నిజ జీవితంలో మాత్రం సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఓడించ‌డానికి ఈ డైలాగుల్నే పావులా ఉప‌యోగిస్తున్నారు. త్వ‌ర‌లో ముంద‌స్తు ఎన్నిల‌కు జ‌రుగుతున్నాయ‌నే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతుంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నిక‌ల్ని స‌వాల్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా పావులు క‌దుపుతున్నారు. ఓ వైపు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైతే కేసీఆర్ మాత్రం రాష్ట్ర విభ‌జ‌న‌లో భాగంగా కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని, వాటికి ప‌రిష్కార మార్గం చూపండ‌ని హ‌స్తిన పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. కానీ ఆ మంతనాల‌న్నీ ముంద‌స్తు ఎన్నిక‌ల కోస‌మేన‌ని తెలుస్తోంది. 
 
ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హించాల్సిందేన‌ని కేసీఆర్ కేంద్రంతో లాబీయింగ్ లు న‌డుపుతుంటే..కాంగ్రెస్ మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా వీగి పోయేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న‌ట్లు టాక్. రాష్ట్ర విభ‌జ‌న‌లో భాగంగా తెలంగాణ‌లో ఉన్న ముంపు మండ‌లాల్ని ఏపీకి త‌ర‌లించిన త‌రువాతే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని కోర్టులో పిటిష‌న్ వేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.అందుకే కేసీఆర్ కాంగ్రెస్ ఎత్తుల్ని చిత్తుచేస్తు ఎన్నిక‌ల కోసం కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌నేది టీఆర్ఎస్ నేతల మాట‌. 
 
అంతేకాదు ఈ ఎన్నిక‌ల్లో మొత్తం స్థానాల్ని దక్కించుకునేలా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 119 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండగా 90నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌జ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, 22 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ సంఖ్య‌లో ఉన్న న‌ల్గొండ, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో టీఆర్ఎస్ పాగా వేసేలా వ్యూహాలు ర‌చ‌న చేస్తుంది. ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఓడించేలా కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు.
 
గ‌తంలో 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్..నాటి నుంచి నేటి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క్ర‌మాలు విస్తృతంగా చేస్తున్నారు. ఎన్నిక‌లు జ‌రగ‌క‌పోయినా ..అదే ఒక‌ర‌వ‌డితో అక్క‌డ కార్య‌క్రమాల్ని కొన‌సాగిస్తోంది. ఇక్క‌డ అర్థ‌, అంగ‌, ప్ర‌జాబ‌లాలున్న అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసేందుకు కేసీఆర్ ఆప‌రేష‌న్ కొడంగ‌ల్ పేరుతో స‌ర్వే చేయిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.