ప‌వ‌న్ పై కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-13 04:13:10

ప‌వ‌న్ పై కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై తెలంగాణ‌ బీజేఎల్పీ నేత జి.కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు  అస‌లు న‌టించ‌డ‌మే రాద‌ని, అన్న చిరంజీవిని అడ్డుపెట్టుకుని సినిమా యాక్ట‌ర్ అయ్యారంటూ కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 
 
దీంతో పాటు ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రాడంటూ త‌న మ‌నసులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు కిష‌న్ రెడ్డి. ప‌వ‌న్ క‌ళ్యాణ్  కంటే చిరంజీవి కొడుకు రామ్ చ‌ర‌ణ్ మంచి న‌టుడ‌ని అన్నారు. కేవ‌లం మీడియా మ‌ద్ద‌తుతోనే నాయ‌కుడు అవుదామ‌ని అనుకుంటున్నారంటూ  ప‌వ‌న్ పై  కిష‌న్ రెడ్డి ఎద్దేవా చేశారు.
 
మ‌రోవైపు రేవంత్ రెడ్డిపై కూడా కిష‌న్ రెడ్డి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరిన రేవంత్ రెడ్డి బీజేపీలో ఇమ‌డ‌లేర‌ని అభిప్రాయ‌డ్డారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పాద‌యాత్ర చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని, పార్టీతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కిషన్ రెడ్డి మీడియాకు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.