ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్య‌ను కిష‌న్ రెడ్డి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-07-23 18:22:54

ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్య‌ను కిష‌న్ రెడ్డి

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆవిర్బావం నుంచి జి.కిషన్ రెడ్డి పార్టీ మ‌నుగ‌డ కోసం నిరంత‌రం కృషి చేస్తూనే ఉన్నారు. 2004లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు  జరిగితే ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రపున‌ హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  మొద‌టిసారి పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థిపై గెలిచారు. ఆ త‌ర్వాత 2009, 2014లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ త‌రుపున అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించారు కిష‌న్ రెడ్డి.
 
ఇక 2019లో హోరా హోరిగా ఎన్నిక‌ల్లో కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజ‌యాన్ని సాధిస్తార‌నే క్ర‌మంలో బీజేపీ అనుచ‌రులు కార్య‌క‌ర్త‌ల‌ను షాక్ కు గురిచేశారు కిష‌న్ రెడ్డి. ఇక నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌కుండా ఎంపీగా నిలిచి, తదుపరి కేంద్ర మంత్రివర్గంలో భాగం కావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని కిషన్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు.
 
అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయ్యాల‌ని కిష‌న్ రెడ్డి చూస్తున్నారు. కాగా ఇప్ప‌టికే ఈ రెండు ప్రాంతాల్లో కిష‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న కూడా చేప‌డుతున్నారు. ప్ర‌ధాని మోడీ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ అధికారంలో ఉన్న నాయ‌కుల ప‌రిపాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు ఆయ‌న‌. అలాగే గతంలో ఆయ‌న పోటీ చేసిన అసెంబ్లీ స్థానం అయిన అంబర్‌పేట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తన భార్య‌ను బీజేపీ త‌ర‌పున పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.