మేధావి మౌనం వీడిన వేళ..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-06 03:14:13

మేధావి మౌనం వీడిన వేళ..?

తెలంగాణ రాష్ట్రం సాధించ‌డంలో  తెలంగాణ జేఏసి చైర్మ‌న్ కోదండ‌రామ్  పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌త్యేక  రాష్ట్రం కోసం జ‌రిగిన ఉద్య‌మాన్ని అహింసాయుతంగా న‌డిపిన విధానం అమోఘం. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, స‌క‌ల‌జ‌నుల స‌మ్మె లాంటి  ఉద్య‌మాల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన తీరు యావ‌త్ తెలంగాణ మొత్తం మెచ్చుకుంది.
 
అయితే రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత కోదండ‌రాం కొన్నాళ్లు ప్ర‌జా జీవితానికి దూరంగా ఉన్నారు. ఏ విప్ల‌వాలు ఏ సాధ‌న‌ల కోసం తెలంగాణ ఏర్ప‌డిందో పాల‌కులు ప‌ద‌వి వ‌చ్చాక మ‌ర్చిపోయార‌ని ఎలుగెత్తారు కోదండ‌రాం.కుటుంబ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూ తెలంగాణ కోసం ఆత్మ‌బ‌లిదానం చేసుకున్న అమ‌రుల‌ను స్మ‌రిస్తూ, కొదండ‌రామ్ ప్ర‌జ‌ల త‌రుపున పోరాడడానికి సిద్దం అయ్యారు.. ఆయ‌న‌కు త‌మ పార్టీల్లోకి రావాలి అని తెలంగాణ గ‌డ్డ‌లో ఉన్న ప్ర‌తీ పార్టీ ఆహ్వానం పంపింది. ఆయ‌న తృణ ప్రాయంగా ఆ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించారు.
 
తెలంగాణ వ్యాప్తంగా కోదండ‌రాం కు పేరు ప్ర‌ఖ్యాత‌ల‌తో పాటు, ఉద్య‌మ కేడ‌ర్ సైతం ఆయ‌న వెంట ఉంది.. అందువ‌ల్ల  ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి  క్రియాశీల  రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రాజ‌కీయ పార్టీని సైతం స్థాపించ‌డానికి సిద్దం అయ్యారు.. కోదండ‌రాం పార్టీ ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయ పార్టీల్లో గుబులు పుట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ముచ్చెమ‌ట‌లు పెట్టించే అవ‌కాశం ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.