పార్టీ జెండాను ఆవిష్క‌రించిన కోంద‌డ‌రాం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kodandaram tjs party
Updated:  2018-04-05 16:36:53

పార్టీ జెండాను ఆవిష్క‌రించిన కోంద‌డ‌రాం

టీ.జేఏసీ  చైర్మన్ కోదండ‌రాం స్థాపించ‌బోయే పార్టీ పేరు తెలంగాణ జన సమితి అని ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఆ పార్టీకి సంబందించిన జెండాను తాజాగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు అధ్యక్షుడు ఎం.కోదండరాం. ఆ జెండాను పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో రూపొందించారు.
 
ఈ సందర్భంగా  మాట్లాడిన అధ్య‌క్షుడు కోడండ‌రాం పాలపిట్టకు అపజయం తెలియదని తెలిపారు. పాలపిట్ట రంగును అద్దుకున్న టీజేఎస్‌ ఎక్కడైనా విజయం సాధిస్తుందని అన్నారు. స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా పాలిస్తున్నారని కోదండ‌రాం విమ‌ర్శించారు. హ‌క్కుల కోసం, బాధితులు న్యాయం కోసం పోరాటం చేస్తే అక్ర‌మ అరెస్టులు చేయిస్తున్నార‌ని తెలిపారు. 
 
భావ వ్యాప్తి కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం పార్టీ అవసరమ‌ని తెలిపారు. తెలంగాణ ఉద్య‌మం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 99 శాతం పోరాటం చేశామ‌ని తెలిపారు.... ఇంక ఒక్క శాతం మాత్ర‌మే మిగిలి ఉందని అన్నారు..... 1996 నుంచి ఆచార్య జయశంకర్‌ సార్‌తో తెలంగాణ ప్రయాణం ప్రారంభించాం. అవే ఆశయాలను ఖ‌చ్చితంగా సాధించి తీరుతాం అని అన్నారు. రాష్ట్ర ప్రజల బాగుకోసమే టీజేఎస్‌ పుట్టిందని స్పష్టంచేశారు. ఈ నెల 29న బహిరంగసభతో తమ బలమేంటో చూపిస్తామని కోదండ‌రాం తెలిపారు. సైకిల్‌తో బయల్దేరిన కాన్షీరాం, చీపురు చేతబట్టిన కేజ్రీవాల్‌ రాజ్యాధికారం సాధించలేదా అని ప్రశ్నించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.