కోదండరాం పార్టీ పేరు ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kodandaram image
Updated:  2018-04-02 07:06:33

కోదండరాం పార్టీ పేరు ప్ర‌క‌ట‌న

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా  జ‌రిగిన ఉద్య‌మంలో సీఎం కేసీఆర్  తో పాటు జేఏసీ చైర్మన్‌గా కోదండరాం కూడా కీల‌క పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌చ్చిన గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్‌య‌స్ పార్టీ విజ‌యం సాధించ‌డానికి జేఏసీ ప్ర‌ముఖ పాత్ర పోషించింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 
 
టీఆర్‌య‌స్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత కేసీఆర్‌ పరిపాలన విధానం న‌చ్చ‌క‌పోవ‌డంతో పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం. ఏ నినాదాల‌తో రాష్ట్రం సాధించుకున్నామో వాటిని కేసీఆర్ తుంగ‌లో తోక్కుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కోదండరాం రాజకీయ పార్టీని  పెడుతున్నారు అంటూ వార్త‌లు వినిపించాయి
 
టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా కీలక అడుగులు పడిన సంగతి తెలిసిందే.  అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తామని ఆయన గతంలో చెప్పారు. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు.. పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్‌లో ఉంటుందని  వెల్లడించారు.
 
తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల ప‌క్షాన‌ ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఆందోళనలు నిర్వహించిన కోదండరాం ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెట్ట‌డానికి తన స్థాపించబోయే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ జనసమితి పేరిట పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఇవాళ‌ అధికారికంగా తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని కోదండ‌రాం తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.