కేసీఆర్ కు వ్య‌తిరేకంగా మూడు చోట్ల పోటీ చేస్తాం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

konda surekha
Updated:  2018-09-08 01:02:24

కేసీఆర్ కు వ్య‌తిరేకంగా మూడు చోట్ల పోటీ చేస్తాం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించ‌కుండా అవ‌మానించార‌ని కొండా సురేఖ‌ మండిప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ త‌న‌కు సీటు ఇవ్వ‌కుండా త‌న అభిమానుల‌నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లను కూడా టీఆర్ఎస్ నాయ‌కులు అవ‌మానించార‌ని ఆమె ఆరోపించారు. 
 
తాను ఎమ్మెల్యే అయిన త‌ర్వాత వ‌రంగ‌ల్ జిల్లాలో అనేక అభివృద్ది కార్య‌క్రమాలు చేశామ‌ని పార్టీ ఫండ్స్‌తో సంబంధం లేకుండా సొంత డ‌బ్బుల‌ను ఖ‌ర్చు చేసి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేశామ‌ని కొండా సురేఖ తెలిపారు. త‌న‌కు సీటు కేటాయించ‌కుండా మంత్రి కేటీఆర్ త‌న‌పై కక్ష‌సాధింపు చ‌ర్య‌లు చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు.అంతేకాదు తన‌కు కేసీఆర్ టికెట్ కేటాయించ‌క‌పోవ‌డానికి తాను చేసిన త‌ప్పు ఏంట‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.
 
గ‌త ఎన్నిక‌ల్లో కారు గుర్తుపై గెలిచిన వారికి టికెట్ ఇవ్వ‌కుండా ఇత‌ర పార్టీల నుంచి కారెక్కిన వారికి ఎలా టికెట్ ఇస్తారని కొండాసురేఖ ప్ర‌శ్నించారు.. నాకు టికెట్ ఇవ్వ‌క‌పోతే నాకు ఏం న‌ష్టం లేదని..  కేవ‌లం టీఆర్ఎస్ కే న‌ష్టం అని ఆమె అన్నారు. అలాగే తాము రెండు టికెట్లు అడిగామ‌ని అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేశారని, కానీ తమ‌కు ఒక్క టికెట్ ఇస్తామ‌ని చెప్పినా కూడా ఒప్పుకున్నామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.
 
టీఆర్ఎస్ లో వ‌ర్గాలు కేటీఆర్ కోట‌రీని త‌యారు చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు అవ‌స‌రం అయితే వ‌రంగ‌ల్ ఈస్ట్, ప‌ర‌కాల‌, భూపాల్ ప‌ల్లి ఈ మూడు ప్రాంతాల్లో త‌మ కుటుంబం ఇండిపెండెంట్ గా అయినా పోటీ చెయ్య‌డానికి కూడా సిద్దంగా ఉన్నామ‌ని కొండాసురేఖ స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.