తెలంగాణ అసెంబ్లీలో ర‌చ్చ‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana assembly  image
Updated:  2018-03-12 03:48:08

తెలంగాణ అసెంబ్లీలో ర‌చ్చ‌

తెలంగాణ  అసెంబ్లీలో బ‌డ్జెట్‌ స‌మావేశాలు మొద‌ల‌య్యాయి. మొద‌ట‌గా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ ప్ర‌సంగంతో మొద‌లైంది అసెంబ్లీ... ఇక  అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ‌డ్జెట్ ప‌త్రాలను ముక్క‌లు చేసి గ‌వ‌ర్న‌ర్ పై  విసురుతూ, పోడియం ద‌గ్గ‌ర‌కు దూసుకెళ్లారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేల నినాదాలతోనే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొన‌సాగించారు. ఆ స‌మ‌యంలోనే  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి హెడ్‌ఫోన్స్‌ను విసిరేశారు. అవి నేరుగా కౌన్సిల్ చైర్మ‌న్  స్వామి గౌడ్ కంటికి త‌గిలాయి.
 
దీంతో స్వామి గౌడ్‌ను హుటాహుటిన‌ స‌రోజినిదేవి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు అధికారులు. కొమ‌టిరెడ్డి వ్య‌వ‌హారం పై టీఆర్‌య‌స్ స‌ర్కార్ సీరియ‌స్ అయింది. ఈ వ్య‌వ‌హ‌రం పై రేపు అసెంబ్లీలో చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. దీని పై స్పందించిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ త‌న పై చ‌ర్య‌లు తీసుకునే ధైర్యం టీఆర్‌య‌స్ ప్ర‌భుత్వానికి లేద‌ని అన్నారు. ఒక వేళ తీసుకుంటే నేను ప్ర‌జ‌ల్లోకి వెళ్లి నిరూపించుకుంటాన‌ని తెలియ‌జేశారు... అదే విధంగా టీఆర్‌య‌స్ ప్ర‌భుత్వం పై రాష్ట్ర ప్ర‌జ‌లు చ‌ర్య‌లు తీసుకునే రోజు ముందుంద‌ని తెలియ‌జేశారు కొమ‌టిరెడ్డి.
 
ఈ దాడి పై స్పందించిన టీఆర్‌య‌స్ నాయ‌కులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాంగ్రెస్ ఇలా ప్ర‌వ‌ర్తించింద‌ని అన్నారు. ఆదివారం జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ స‌మావేశంలో నాయ‌కులు ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా దాడికి  దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ముందే తెలుస‌ని అన్నారు. అందువ‌ల్ల‌నే స‌భా నియ‌మాల‌ను పాటించాల‌ని ఉద‌య‌మే తెలియ‌జేశామ‌ని అన్నారు. ఇలాంటి విధానంతో స‌భ‌కు వ‌చ్చేవారిపై  క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీఆర్‌య‌స్ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.