ఆ ఖ‌ర్మ మాకు ప‌ట్ట‌లేదు అదంతా చంద్ర‌బాబు కుట్రే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-09-15 12:26:10

ఆ ఖ‌ర్మ మాకు ప‌ట్ట‌లేదు అదంతా చంద్ర‌బాబు కుట్రే

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొద్ది కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీతో ర‌హ‌స్య అవ‌గాహ‌న చేసుకుంటున్నార‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా వారు చేస్తున్న విమ‌ర్శ‌లపై ముఖ్య‌మంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ ప్ర‌ముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ బీజేపీతో తాము ఎలాంటి ర‌హ‌స్య అవ‌గాహన చేసుకోలేదని స్ప‌ష్టం చేశారు. 
 
బీజేపీతో టీఆర్ఎస్ నాయ‌కులు అవ‌గాహ‌న చేయాల్సిన‌ ఖ‌ర్మ పట్ట‌లేద‌ని కేటీఆర్ ద్వ‌జ‌మెత్తారు. ఇదంతా కావాల‌నే ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ కేవ‌లం ఐదు అసెంబ్లీ సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకుంద‌ని, అలాగే కొద్దిరోజుల క్రితం జ‌రిగిన కార్పోరేష‌న్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేని దుస్థితి ఉన్న పార్టీతో అవ‌గాహ‌న పెట్టుకోవ‌ల్సిన ఖ‌ర్మ త‌మ‌కు ప‌ట్టలేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
ఇంతవరకు తాము బీజేపీతో ఎలాంటి అవ‌గాహ‌న, ఒప్పందాలు పొత్తులు చేసుకోలేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇదంతా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌ అని ఆయ‌న మండిపడ్డారు. చంద్ర‌బాబు త‌మ‌కు బీజేపీతో అంట‌క‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని మోడీకి ఎలాంటి సంబంధం లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.