ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డ‌మే మా ల‌క్ష్యం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-06 12:35:54

ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డ‌మే మా ల‌క్ష్యం

రాష్ట్ర ప్ర‌జ‌లు అభివృద్ది చెందాలంటే  ప్ర‌భుత్వాలు ప‌రిపాల‌న‌ను వికేంద్రిక‌ర‌ణ చేయాలి..ఆదిశ‌గా టీఆర్ఎస్  ప్ర‌భుత్వం అడుగులు వేసింద‌ని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తాజాగా మంత్రి కార్యాల‌యంలో 2018 తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీని కేటీఆర్‌ ప‌లువురి స‌మ‌క్షంలో ఆవిష్క‌రించారు.
 
ఈ స‌మావేశంలో  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికార‌ వికేంద్రిక‌ర‌ణ చేస్తున్న టీర్ఎస్ ప్ర‌భుత్వానికి  అధికారులు స‌హ‌క‌రించాల‌ని కొరారు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి ప‌రిధిలో ఉన్న‌ సర్కిళ్లను, జోన్లను మ‌రింత విస్త‌రిస్తామ‌ని..... అయితే ప్ర‌భుత్వం తీసుకొచ్చిన  సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేయ‌డంలో శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని  అధికారుల‌కు పిలుపు నిచ్చారు.
 
ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డం కొసమే 15వేల ఓట్లు ఉన్న గ్రామ పంచాయితీల‌ను, న‌గ‌ర, మున్సిపాలిటీలుగా మార్చాల‌న్న‌టువంటి  నిర్ణయం ప్రభుత్వం తీసుకుంద‌ని చెప్పారు. అయితే వీటికి అయ్యే ఖ‌ర్చుని ప్ర‌భుత్వం విడుద‌ల చేస్తుంద‌ని అన్నారు.  ఈ శాఖ‌కు సంబంధించి  వ‌చ్చే కొత్త ఉద్యోగాల‌ను, మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు,ఖాళీల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు  మంత్రి కేటీఆర్ . ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి, ఎంఎల్‌ఎ వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరుల పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.