క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు అనే నేను..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana it minister ktr
Updated:  2018-09-03 01:29:17

క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు అనే నేను..?

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు ప్ర‌మోష‌న్ ఇస్తారా..? గ‌్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ కేటీఆర్ త‌న ప్ర‌చారంతో  టీఆర్ఎస్ పార్టీ 99స్థానాల్లో విజ‌యం సాధించింది. మ‌రి ముంద‌స్తు ఎన్నిక‌లు, అసెంబ్లీ ర‌ద్దుతో కొంగ‌ర‌కొలాన్ స‌భ‌లో కేటీఆర్ కు ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి గా అవ‌కాశం ఇస్తారా..? అంటే అవున‌నే అంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు. 
 
ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌కు ప‌దును పెట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 100అసెంబ్లీ సీట్లు గెలిచేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెళ్లిన కేసీఆర్ ముందుస్తు ఎన్నిక‌ల‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌తో రాష్ట్రానికి తిరిగివ‌చ్చారు. నాటి నుంచి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. 
 
ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌పేరుతో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కొంగ‌ర‌కొలాన్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు ..మున్సిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని అంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు 
 
ఇప్ప‌టికే ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్ ముఖ్యమంత్రి రేసులో వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతార‌ని ముమ్మ‌ర ప్ర‌చారం చేస్తున్నారు.  అందుకు ఊతం ఇచ్చేలా టీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ తర్వాతి స్థానం కేటీఆర్‌దేననే ముద్ర క్రమంగా బలపడుతూ వస్తోంది. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కేటీఆర్‌ ప్రాధాన్యాన్ని పెంచడం, ప్రభుత్వ, ప్రైవేటు ప్రముఖులు ఎవరైనా తనను కలిసే ప్రయత్నం చేస్తే.. చాలాసార్లు మంత్రి కేటీఆర్‌ వద్దకు పంపించడాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, పార్టీ పదవుల ఖరారులో మంత్రి కేటీఆర్‌ సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారు. ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏ నిర్ణయమూ జరగడంలేదని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  
 
2014  ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన కేసీఆర్..కేటీఆర్ ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. నాటి నుంచి 2019 ఎన్నిక‌ల్లో కేటీఆర్ ముఖ్యమంత్రిగా పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జోరందుకుంది. దీనికి తోడు గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో గెలిచింది. కేటీఆర్‌ ప్రచారం, వ్యూహ చతురత కారణంగా అన్ని స్థానాల్లో గెలిచామని టీఆర్ఎస్  చెప్పుకుంది. 
 
ఈ నేపథ్యంలోనే, రాబోయే ఎన్నికలకు సమరశంఖంగా భావిస్తున్న ప్రగతి నివేదన సభ నిర్వ‌హాణ బాధ్య‌త‌లు మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఈ స‌భ‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఏ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నేది చ‌ర్చాంశ‌నీయంగా మారింది.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.