తొలిప్రేమ సినిమా పై కేటీఆర్ ట్వీట్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-11 01:59:02

తొలిప్రేమ సినిమా పై కేటీఆర్ ట్వీట్

ఫిదా సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న‌ మెగా హీరో వరుణ్ తేజ్‌ లీడ్ రోల్‌లో తెరకెక్కిన మరో చిత్రం తొలిప్రేమ‌...ఈ సినిమా శ‌నివారం  విడుద‌లై   బాక్సాఫీస్ వ‌ద్ద తెలుగు రాష్ట్రాల మోగా అభిమానుల‌ను అల‌రిస్తోంది... ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వ‌హించారు... 
 
తాజాగా ఈ సినిమాపై తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్   తన సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసునుకుని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు... రాష్ట్రంలో కీల‌క ప‌ద‌వుల‌లో ఉంటూ కూడా  ఎంత బిజీగా ఉన్నా కాని వాటిని  పూర్తి చేసుకుని  ఆయా సినిమాలు విడుద‌ల కాగానే  ఎప్ప‌టిక‌ప్పుడు చూస్తుంటారు కేటీఆర్...
 
 ఇటీవ‌ల విడుద‌లైన  తొలిప్రేమ సినిమాను మంత్రి కేటీఆర్ చూశారు... ఈ సినిమా చూసిన త‌ర్వాత సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం  చేశారు  కేటీఆర్...చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి సినిమా చూశాన‌ని, న‌టీన‌టుల పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు ఆద్బుతంగా చిత్రీకరించార‌ని మంత్రి త‌న ట్విట్ట‌ర్ లో పేర్కోన్నారు... 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.