కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ktr image
Updated:  2018-03-15 04:28:03

కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఉత్తరప్రదేశ్‌లో నిన్న వెల్ల‌డైన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల పై తెలంగాణ పంచాయ‌తీరాజ్‌, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ట్‌ర్ ద్వారా స్పందించారు.. రాజ‌కీయాల్లో అధికారం శాశ్వ‌తమైన‌ది కాద‌ని  ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నిక ఫ‌లితాల ద్వారా  మ‌రోసారి స్పష్టమైందని కేటీఆర్‌ తెలిపారు. రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర తగ్గిపోయిందన్న కేసీఆర్‌ ఆఖరికి వాటికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి తలెత్తిందని చెప్పారు. 
 
వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవ‌డానికి ముందు యూపి ఎన్నిక‌లను ఛాలెంజింగ్ గా తీసుకున్న బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌ని అన్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్‌ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది. ప‌చ్చిగ‌డ్డి వేస్తే బ‌గ్గుమ‌నే విధంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో ఒప్పందం చేసుకొని బీజేపీని ఓడించాయి.
 
యూపి ఉప‌న్నిక‌ల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఒట‌మి చెంద‌డం కోలుకోలేని దెబ్బ అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ విధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.