టీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్న కీల‌క నేత‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-08-22 16:59:33

టీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్న కీల‌క నేత‌లు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో గ్రూప్ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టే ప‌నిలో ఉన్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్. ఇత‌ర పార్టీల నుంచి కారేక్కిన ఎమ్మెల్యేల‌కు పోటీగా టికెట్ ఆసిస్తున్న సొంత‌పార్టీ నేత‌ల‌కు హిత‌బోదు చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో శేరిలింగంప‌ల్లిలో ఎమ్మెల్యే టికెట్ ఆసిస్తూ ప్ర‌చారం చేసుకుంటున్న కార్పొరేట‌ర్ల‌కు నియోజ‌వ‌ర్గ నేత‌ల‌కు క్లాస్ తీసుకున్నారు మంత్రి కేటీఆర్.
 
 జీహెచ్ ఎంసీ ప‌రిధిలో శేరిలింగం ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ప్ర‌ముఖ ఐటీ కంపేనీలు ధ‌న వంతులు సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండేది ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గెలిచిన అరికెపూడి గాంధీ ప్ర‌స్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. సిటీలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కమైన ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మంత్రి కేటీఆర్ ఎప్ప‌టినుంచో ప్ర‌త్యేక దృష్టి సాదించారు. 
 
అయితే తాజాగా శేరిలింగం ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నేత‌లతో స‌మావేశం అయ్యారు మంత్రి కేటీఆర్. శేరిలింగం ప‌ల్లి అసెంబ్లీ టికెట్ ఆసిస్తున్న టీఆర్ఎస్ నేత‌ల జాభితాను శార‌డంత ఉంది. ఈ సారి ఎమ్మెల్యేగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకోవాల‌నుకుంటున్నారు టీఆర్ఎస్ నాయ‌కులు. అయితే  ఈ క్ర‌మంలో గ‌చ్చిబౌలి కార్పోరేట‌ర్ సాయిబాబా, మాధాపుర్ కార్పోరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్, శేరిలింగం ప‌ల్లి రాగం నాగేంద‌ర్ యాద‌వ్ లు టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. 
 
ఇక వీరితో పాటు గ‌తంలో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిన బండి ర‌మేష్, అలాగే టీడీపీ నుంచి పోటీచేసి ఓడిన మువ్వ‌స‌త్య‌నారాయ‌ణ కూడా టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చెయ్య‌ల‌ని భావిస్తున్నారు.. మ‌రో వైపు ఉద్య‌మం స‌మ‌యం నుంచి టీఆర్ఎస్ కోసం ప‌నిచేసిన కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొమ‌రం శంక‌ర్ గౌడ్ కూడా భ‌రిలోనే ఉన్నారు. అయితే కొంద‌రుకార్పొరేట‌ర్లు ఇక్క‌డ ఛాన్స్ రాక‌పోతే  మ‌రో మ‌రో పార్టీ నుంచి అయినా పోటీ చేయ్యాల‌ని, అదీ కుద‌ర‌క‌పోతే ఇండీ పెండెంట్ గా అయినా తేల్చుకోవాల‌ని చూస్తున్నారు. సొంత‌పార్టీలో అవ‌కాశం లేకపోయినా భ‌రిలో దిగ‌డం త‌ప్ప‌ద‌నే సంకేతాలు పంపుతున్నారు. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.