మహాకూటమి కి అంత దమ్ముందా..

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr
Updated:  2018-11-06 13:02:08

మహాకూటమి కి అంత దమ్ముందా..

ప్రతి పక్షాలను ఐఖ్యంచేసి, శక్తివంతమైన వ్యతిరేఖ కూటమి నిర్మించి అధికారాన్ని కూలదోయాలని ఇటు తెలంగాణాలో, అటు కేంద్రంలో చంద్రబాబు కన్నా కలలు నెరవేరేలా లేవు.. ఒక తెలంగాణాలోనే కేవలం రెండు ప్రధాన పార్టీలు టిఆరెస్, కాంగ్రెస్ మద్య పోరాటమున్న చోటే ఇతర తుకడా పార్టీలను ఐఖ్యం చేసి ఏర్పాటు చేసిన  మహాకూటమిని తో  సీట్ల సర్దుబాటులో నెట్టుకురాలేకపోతున్నారు.. ఇక జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన మోడీ సారధ్యంలోని బిజెపిని ఢీ కొట్టటం సాధ్యమా అని అనుమానాలు వస్తున్నాయి.. మరి మహాకూటమి కి అధికారాన్ని దించేంత అంత దమ్ముందా.. ఇప్పుడూ చూద్దాం..
 
ప్రస్తుతం ఉన్న మహాకూరమిలో ఇంకా సీట్ల సర్దుబాటు కాకపోవడం మహాకూటమికే అవమానం.. ఇక్కడున్న నాలుగు లెదా ఐదు పార్టీలనే కలిపి ఐఖ్యం చేసి ఎన్నికల రణక్షేత్రం లో ప్రత్యర్ధుల ముందు నిలపలేకపోతున్న చంద్రబాబు - అత్యంత దురాశాపరులైన కాంగ్రెస్, తెలుగుదేశం, సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ, తృణమూల్, రాష్ట్రీయ జనత దళ్, లోక్ తాంత్రిక్ జనత దల్, నేషనలిష్ట్ కాంగ్రెస్, జెడియు, జెడిఎస్, ఎంజిపి, ఆప్, డిఎంకె, ఏడిఎంకె ఇలాఇన్ని పార్టీలను దురాశా పరుడైన చంద్రబాబుకు ఒక్కతాటిపైకి తేవాలనుకువడం సాధ్యం కానీ పని.. తెలంగాణ ఎన్నికల రణరంగానికి ఇంకా 32 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇంకా మహా కూటమి పంచాయితీ తెగలేదు. దీంతో ఇటీవలే కేటీఆర్ ఒక కొత్త వ్యాఖ్యానం చేశారు. అది బాగా పాపులర్ అవుతోంది.
 
మహాకూటమి సీట్లు పంచుకునేలోపు, మేము స్వీట్లు పంచుకుంటాం, అని. అదే నిజమయ్యేలా ఉంది పరిస్థితి. మహాకూటమికి కోదండరాం అవసరం ఎంతుందో? స్పష్టంగా తెలుసు. ఆయన్న వదులుకోడానికి ఇష్టపడటం లేదు. అలాగని ఆయన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొగుడి నుంచి ప్రేమ తప్ప ఖర్చులకు డబ్బులు రావడం లేదన్నట్లుంది కోదండరాం పరిస్థితి.  మర్యాదకు మాత్రం ఢిల్లీ స్థాయిలో కూడా తక్కువ లేదు. కానీ సీట్ల విషయంలో గల్లీ స్థాయి ప్రాధాన్యం. ఇక టీడీపీ కూడా ఇంకా సీట్లు కావాలని పట్టుబడుతుండగా - సీపీఐ, ఐదు ఇవ్వమని ఖరాఖండిగా చెబుతోంది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ తో పోలిస్తే మహాకూటమి ప్రచారంలో చాలా వెనుక పడి ఉంది. సగానికి పైగా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం పూర్తి చేసుకుంది.
 
కానీ మహా కూటమి ఇంకా మొదలే పెట్టలేదు. దీంతో మహాకూటమి అభ్యర్థులు బాగా వెనుకపడిపోతున్నారు. మహాకూటమి పొత్తుల్లో అసలు నియోజకవర్గం సీటు మా పార్టీకే దక్కుతుందా? లేదా? అన్న అనుమానం కనీసం 50 నియోజక వర్గాల్లో ఉండటంతో అక్కడ ఏ పార్టీ అభ్యర్థి రూపాయి విదల్చడం లేదు. దీంతో ప్రచారం ముందు పడటం లేదు. ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఐదేళ్లూ చేసిన అభివృద్ధి కంటే కూడా అభ్యర్థులు చేసే ప్రచారమే జనాలకు బాగా ఎక్కుతుంది.  మరి వీళ్ళ సీట్ల గోల తేలేదెప్పుడో.. చూద్దాం.. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు