మ‌హాకూట‌మిలో కాంగ్రెస్ సీట్ల స‌ర్దుబాటు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana mahakutami
Updated:  2018-11-06 02:02:14

మ‌హాకూట‌మిలో కాంగ్రెస్ సీట్ల స‌ర్దుబాటు

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త రానున్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న ఒక కొలిక్కి వ‌చ్చే దిశ‌గా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో ఏఐసీసీ స్క్రీనింగ్ క‌మిటీ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. అయితే ఇప్ప‌టికే 57 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌పున పోటీ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించేందుకు సిద్దంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 
 
ఇక మిగిలిన సీట్ల‌పై స్క్రీనింగ్ క‌మిటీలో తీవ్రంగా చ‌ర్చ జ‌రుతుతోంది. మ‌హాకూట‌మిలోని పొత్తులో భాగంగా సీపీఐకి నాలుగు తెలంగాణ జ‌న స‌మితి పార్టీకి 9 నుంచి ప‌ది అలాగే తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అంతే స్క్రీనింగ్ క‌మిటీ త‌ర్వాత అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు సంబంధిన అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు  తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్, ఈ క‌మిటీలో బ‌ట్టి విక్ర‌మార్కతో పాటు జానారెడ్డి, ష‌బ్బీర్ లు పాల్గొన్నారు. 

షేర్ :

Comments

0 Comment