టీఆర్ ఎస్ లో ఆ పార్టీదే ఆదిప‌త్యం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-07-18 17:29:53

టీఆర్ ఎస్ లో ఆ పార్టీదే ఆదిప‌త్యం

తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీ త‌రపున ఏ నిర్ణ‌యం తీసుకున్నా అధినేత కేసీఆర్ దే ఫైన‌ల్ డెసిష‌న్. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం టీఆర్ ఎస్ పై మ‌రో నేత ప్ర‌భావం చూపుతున్నార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.  అయితే ఆయ‌న ఎవ‌రో కాదు ఎమ్ ఐ ఎమ్ అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ. తెలంగాణ ఏర్ప‌డిన నాటినుంచి ఓవైసీ, టీఆర్ ఎస్ తో స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తున్నారు. గ‌తంలో జ‌రిగిన‌ గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా ఎమ్ ఐ ఎమ్ టీఆర్ పార్టీలో అవ‌గాహ‌న‌తో క‌లిసి పోటీ చేశాయి. 
 
అలాగే ఎమ్మెల్సీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ ఎస్ కే ఎమ్ ఐ ఎమ్ మ‌ద్ద‌తు తెలిపింది. ఇక ఈ బంధం రానున్న రోజుల్లో మ‌రింత బ‌లోపేతం అవుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ సంబంధించిన వ‌ర‌కు టీఆర్ ఎస్ ఏ రాజ‌కీయ పార్టీ నాయ‌కుడిని చేర్చుకోవాల‌న్నా ముందుగా ఎమ్ ఐ ఎమ్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్న ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
అయితే ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ నేత దానం టీఆర్ ఎస్ లో చేర‌డం వెనుక ఎమ్ ఐ ఎమ్ నేత‌లు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. నిజానికి దానం చేరికి విష‌యంలో పెద్ద‌గా ఆస‌క్తి లేన‌ప్ప‌టికి ఎమ్ ఐ ఎమ్ అధినేత ద్వారా చెప్పించుకుని గులాబి తీర్థం తీసుకున్న‌ట్లు రాష్ట్ర వ్యాప్తంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
 
ఇక మ‌రోవైపు ఎంత స్నేహ గీతం పాడుతున్నా గ్రేట‌ర్ గ‌ట్టిప‌ట్టు ఉన్న ప్రాంతాన్ని త‌మ‌కు తెలియకుండా ఎలాంటి కార్య‌క్ర‌మాలు చెయ్యెద్ద‌ని టీఆర్ ఎస్ నేత‌ల‌కు ఎమ్ ఐ ఎమ్ ప‌రోక్షంగా సందేశం పంపుతోంద‌ట‌. తాజాగా నిజామాబాద్  జిల్లా బోద‌న్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన వ్య‌వ‌హారం తీవ్ర వివాదంగా మారి టీఆర్ ఎస్ ను ఇబ్బందిలోకి నెట్టింది.
 
ఇక బోద‌న్ విష‌యంలో అధికార నాయ‌కులు ఎమ్ ఐ ఎమ్ దౌక్యం కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్ ఐ ఎమ్ పార్టీకి సంబంధించి స‌మావేశం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేస్తే  ఈ స‌మావేశానికి నిజామాబాద్ ఎంపీ క‌విత హాజ‌రు అయి బోద‌న్ మున్సిపాలిటీ వ్య‌వ‌హారాన్ని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకున్నార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.