బ్రేకింగ్ వాన‌దేవుడు కూడా టీఆర్ఎస్ లోకి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

minister harish rao
Updated:  2018-08-21 06:39:44

బ్రేకింగ్ వాన‌దేవుడు కూడా టీఆర్ఎస్ లోకి

తెలంగాణ‌లో కురుస్తున్న వ‌ర్షాల‌కు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నార‌ని అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు సిద్దిపేట‌లోని ప‌ద్మ‌నాయ‌క ఫంక్ష‌న్ హాల్లో పాడిప‌శువుల పంపిణి అవ‌గాహ‌న కార్యక్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ, కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్ట్ కు సుమారు 2,50,వేల క్యూసెక్కుల నీరు చేరుకుంద‌ని ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 
 
అంతేకాదు కాక‌తీయ‌, ల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి కాల్వ‌లు, గుత్ప, అలీసాగ‌ర్ ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చెయ్యాల‌ని హారీష్ రావు అధికారుల‌కు సూచించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు నిజామాబాద్ రైతుల‌ను రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాలు చేశార‌ని అయితే వారికి త‌మ త‌ర‌పున వ‌రుణుడు త‌గిన బుద్ది చెప్పాడ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మ ప‌రిపాల‌న చూసి వాన దేవుడు కూడా స్పందించి త‌మ పార్టీలో చేరార‌ని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పుష్క‌లంగా వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.

షేర్ :