50 దేశాల్లో కేటీఆర్ కు..?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana it minister ktr image
Updated:  2018-03-07 12:56:43

50 దేశాల్లో కేటీఆర్ కు..?

తెలంగాణ ఐటీ, పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి అయిన క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు  అంటే తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా జ‌రిగిన ఉద్య‌మంలో తండ్రి కేసీఆర్‌కు అండ‌గా ఉండి క్రీయాశీల‌క పాత్ర పోషించిన నాయ‌కుడు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది టీఆర్‌య‌స్ పార్టీ... కేసిఆర్ క్యేబినేట్‌లో మంత్రి బాధ్య‌త‌లు తీసుకున్న కేటిఆర్ త‌న‌దైన శైలిలో పాల‌న చేస్తూ రాష్ట్ర ప్ర‌జ‌ల గుండెల్లో అభిమానం సంపాదించుకున్నారు... క్లిష్ట స‌మ‌యంలో అల‌వోక నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కేటిఆర్‌కు ఎవ‌రూ సాటిలేర‌ని అంటారు.
 
కేటిఆర్ నాయ‌క‌త్వానికి ఆక‌ర్షితులుకాని వారెవ్వ‌రు ఉండ‌రు. ముఖ్యంగా సొంత టీఆర్‌య‌స్ పార్టీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రులు సైతం కేటీఆర్‌కు అభిమానుల‌వుతున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకర్గ ప్రగతి సభలో మంత్రి జగదీష్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన మంత్రి జగదీష్‌రెడ్డి యువ నాయ‌కుడి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌క్క‌నే మంత్రి కేటీఆర్ ఉండ‌టంతో అక్క‌డ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తంచేసి కేటీఆర్ కు అభినంద‌న హ‌ర్ష‌ద్వానాలు తెలియ‌చేశారు.
 
ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ పాల‌న‌లో వెన‌క‌బ‌డిన తెలంగాణ ను ప్ర‌స్తుతం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్న ఎకైక‌ నాయ‌కుడు మంత్రి కేటీఆర్ అని పొగిడారు. ఈ యువ నాయ‌కుడికి ప్రపంచంలో ఉన్న‌ 50 దేశాల్లో అభిమానులు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకుల గురించి మంత్రి కేటీఆర్‌ వున్నది ఉన్నట్టుగా చెబుతూ అలీబాబా గుంపు అన్నారని గుర్తుచేశారు. దేశంలో ఎన్నిక మ్యానిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసిన ఘ‌న‌త‌ టీఆర్‌ఎస్‌కే చెందుతుంద‌ని అన్నారు... 2019 ఎన్నికల్లో అన్ని నియోజకర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ, 2 స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.