బ‌యో ఏషియాలో జుగాడ్ ఫార్ములా మంత్రి కేటీఆర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

bio-asia-meeting-image
Updated:  2018-02-24 01:12:52

బ‌యో ఏషియాలో జుగాడ్ ఫార్ములా మంత్రి కేటీఆర్

అతి త‌క్కువ పెట్టుబ‌డితో అందుబాటులో  ఉన్న వ‌న‌రుల‌తోనే చౌక ఔష‌ధాల‌ను ఆవిష్క‌రించ‌గ‌లిగే జుగాడ్ ఫార్మూలా అవ‌స‌ర‌మ‌ని, రాష్ట్ర ఐటీ మంత్రి కె తార‌క‌రామారావు అన్నారు... ప్రభుత్వాలకు ఆలోచనలకు కొదువ లేకపోయినప్పటికీ పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు లేదన్నారు. కాబట్టి సంస్థలే పెట్టుబడుల పెట్టేందుకు ముందుకు రావాలన్నారు. మ‌న దేశంలో ఔష‌ద రంగం అంత‌ర్జాతీయంగా పోటీ ప‌డుతోంద‌ని కొన్ని సార్లు స‌ర్కారులు విఫ‌లం అవుతున్నాయి అని అన్నారు.
 
ఫార్మా ప‌రిశ్ర‌మ అభివృద్దికి తెలంగాణ స‌ర్కారు మూడు విధాలుగా కృషిచేస్తోంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.. హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌ల్లో ప్ర‌పంచ‌స్ధాయి ప్ర‌మాణాలు క‌లిగిన మౌలిక వ‌స‌తుల‌తో కూడిన ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తోంద‌ని అన్నారు..ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కాబోంతోంద‌ని అన్నారు మంత్రి కేటీఆర్. .జినోమ్‌ వ్యాలీ విస్తరణ చేపట్టనున్నామని, ఇది ఔషధ ఆవిష్కరణలకు హబ్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
 
ఇక ఈ రంగంలో ప‌రిశోధ‌న‌ల కోసం వాటి అవ‌స‌రాల కోసం, ప్ర‌భుత్వాలు కేటాయిస్తున్న పెట్టుబడులు పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంది అని అన్నారు ఐటీ మంత్రి కేటీఆర్.. ప‌రిశోధ‌న‌ల కోసం ప్ర‌భుత్వాలు  ప్రైవేట్ కంపెనీల‌తో క‌లిసి ప‌నిచేయాలి అని తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.