మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

miryalaguda mla bhaskar rao
Updated:  2018-03-22 17:26:45

మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో అధికార టీఆర్‌య‌స్ పార్టీ పై విమర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ, ప్రోఫెస‌ర్ కోదండ‌రాం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టీఆర్‌య‌స్ పార్టీ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ గ‌త కొంత కాలంగా ప‌దునైన బాణాలు సందిస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఇటీవ‌ల అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తుండ‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప్ర‌వ‌ర్తించిన తీరుకు కేసీఆర్ ప్ర‌భుత్వం ఆయ‌న‌ ఎమ్మెల్యే స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌డం వంటి  నియంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
 
తాజాగా అసెంబ్లీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కేసీఆర్ ప్ర‌భుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయ‌న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు... ఫిరాయింపు ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువ‌ల్లే తమ నియోజకవర్గంలో బీటీ రోడ్ల పునరుద్దరణ జరపటంలేదని స‌భ దృష్టికి తీసుకోచ్చారు ఆయ‌న‌. కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌రావు ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఇదే వ్యవహారంపై మరికొంత మంది ఎమ్మెల్యేలు గ‌ళం విప్పారు.
 
పదేళ్లుగా తన నియోజకవర్గంలో బీటీ రోడ్లు పునరుద్ధరణ చేపట్టలేదని, జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు.ఇదే స‌మ‌స్య పై టీఆర్‌య‌స్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇరువురు స‌భ‌లో  ప్ర‌స్తావించ‌గా అధికార పార్టీ నాయ‌కులు ఆశ్చర్యపోయారు. 
 
ఈ సమస్య అన్ని నియోజకవర్గాల్లో ఉందని సభ్యుల ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానాలిస్తారని స్పీక‌ర్ మధుసూదనాచారి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేకపోతే సొంతగూటికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.