కేసీఆర్ ను వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and modi
Updated:  2018-09-03 16:24:15

కేసీఆర్ ను వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ

మ‌నం శ‌త్రువ‌ల్ని జ‌యించాలంటే. వారి బ‌లాబ‌లాన్ని నిర్వ‌ర్యం చేయాలి. దీనికి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. అన్నీ నిర్వ‌ర్యం అయిన త‌రువాత మ‌న‌ తెలివి తేటల‌తో శ‌త్రువును కోలుకోలేని దెబ్బ‌ కొట్టాలి. ఇప్పుడు అదే తెలివితేట‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తోంది కేంద్ర‌ బీజేపీ. సీఎం కేసీఆర్ ను దెబ్బ‌కొట్టేందుకు బీజేపీ ఓ అస్త్రాన్ని సంధిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ లో  జెండా ఎగుర వేయాల‌ని బీజేపీ ప్ర‌యత్నిస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. దీంతో ఇత‌ర పార్టీల నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. బీజేపీ చేతిలో ఉన్న‌ సామ‌దాన భేద దండోపాయాలేంటి..?  బీజేపీ వ‌ల్ల ఇత‌ర పార్టీల్లో ఎందుకు క‌ల‌వ‌రం మొద‌లైంది..? ఇలాంటి విష‌యాలన్నీ మ‌నం తెలుసుకుందాం..? 
 
తెలుగు రాష్ట్రాల్లో అన్నీ రాజ‌కీయ పార్టీలు 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా  స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో నభూతో.. న భవిష్యతి అన్న రేంజ్‌లో ఇబ్రహీంప‌ట్నం కొంగ‌ర‌కొలాన్ లో  భారీ బహిరంగసభను నిర్వహించారు.  ఈ స‌భ‌లో రాజ‌కీయ‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో త్వ‌ర‌లో మీముందుకు వ‌స్తామ‌ని ల‌క్ష‌లాది మంది స‌భాముఖంగా ప్ర‌క‌టించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి సీఎం నేరుగా ప్ర‌స్తావించ‌కుండానే మ‌రో సారి ఆశీర్వాదం కావాల‌ని బ‌హిరంగ స‌భ‌వేదిక‌పై నుంచి కోర‌డం చ‌ర్చాంశ‌నీయ‌మైంది. దీనికి తోడు కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న  బీజేపీని, ఆ పార్టీ నేత‌ల్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు సంధించారు.
 
పీఎం మోడీ , సీఎం కేసీఆర్ కు మంచి స‌న్నిహిత‌సంబంధాలున్నా ఒక్క‌సారిగా కేసీఆర్ రివ‌ర్స్ అవ్వ‌డం ప‌లు అనుమానాలుకు తావిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేలా కేంద్ర‌ క‌మ‌లం నేత‌లు  టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో లోపాయ‌కారి ఒప్పందాల‌కు తెర‌తీశార‌నేది ఆఫ్ ది రికార్డ్  వినిపిస్తోంది. దీంతో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లపై మాట‌మాట్లాడ‌కుండా బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధింస్తూ  కొన్నిపార్టీలు ఢిల్లీకి గులాములుగా, ఢిల్లీ చ‌క్ర‌వ‌ర్తుల‌కు సామంతులుగా ఉందామంటున్నాయి. తెలంగాణ‌లో నిర్ణ‌యాధికారం తెలంగాణ‌లో ఉండాలా..? ఢిల్లీ దొర‌ల కింద ఉండాలా..?  మీరే చెప్పండి. తెలంగాణ అధికారం మ‌న‌ద‌గ్గ‌రే ఉంటే ఆత్మ‌గౌర‌వంతో ఉంటాం. ఢిల్లీ దొర‌ల కింద ప‌నిచేసే పార్టీలు ఢిల్లీ గుమ్మాల ద‌గ్గ‌ర కాప‌లా కాసి, చెంచాగిరీ చేసి టికెట్లు తెచ్చుకోవాలి. ఢిల్లీకి గులాములం అవుదామా..?  తెలంగాణ గులాబీలుగా స్వ‌తంత్ర జీవ‌నం గడుపుదామా అంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.  
 
దీంతో ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న తెలంగాణ బీజేపీ నేత‌లు సీఎం కేసీఆర్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోయారు. అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో చెప్పాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. పీఎం మోడీ నిధులిస్తుంటే..రాష్ట్ర స‌ర్కార్ క్రెడిట్ కొట్టేస్తుందంటూ ముప్పేట దాడి చేస్తున్నారు. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు మోడీ - కేసీఆర్ మైత్రిపై డోలాయ‌మానంలో ఉన్న బీజేపీ నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి..తెలంగాణ లో బ‌ల‌మైన రాజ‌కీయ‌పార్టీగా అవ‌త‌రించాల‌ని చూస్తున్న బీజేపీ గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్రం హైద‌రాబాద్ లో  కొంత‌మంది అజాత శ‌త్రువుల్ని రంగంలోకి దింపిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు, 2019ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌లు కాక‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌నేది తెలంగాణ బీజేపీ ల‌క్ష్యం. 
 
దీన్ని నెర‌వేర్చేలా అమిత్ షా ఆధ్వ‌ర్యంలో తెర‌వెనుక మంత్రాంగం న‌డిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంది. అన్నీ రాజ‌కీయ పార్టీల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌పై ఓ క‌న్నేసింది.ఇప్ప‌టికే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో  అదే సామాజిక వ‌ర్గానికి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్ ను ఎందుకు చేజార్చుకున్నామా అనే సందిగ్ధంలో బీజేపీ ఉంది. 
 
మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాగం జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో 9 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన టీడీపీని వీడి  తెలంగాణ నగారా సమితి పార్టీ స్థాపించారు. అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 
 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం.. బీజేపీలో తగిన ప్రాధాన్యం దొరుకుతుందని ఆశించి భంగపడ్డారు. గత కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సారి అలాకాకుండా చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న బీజేపీ ఇత‌ర పార్టీల్లో ఉన్న రెడ్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకునేందుకు చాణుక్య రాజ‌నీతిని  ప్ర‌ద‌ర్శిస్తోంది. కాంగ్రెస్ - టీఆర్ఎస్ పార్టీల‌కు చెందిన నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేలా కొంత‌మంది బీజేపీ కేంద్రం పెద్ద‌లు హైద‌రాబాద్ లో మ‌కాం వేశారు. 
 
ఓ వైపు టీఆర్ఎస్ లో హ‌రీష్ వ‌ర్గాన్ని, ఈటెల రాజేంద‌ర్, కాంగ్రెస్ లో డీకే అరుణ‌, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ తో పాటు మొత్తం 30మంది ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ పార్టీ బ‌లోపేతం దిశ‌గా అడుగులు వేస్తోందట‌.  మంత‌నాలు నెరుపుతూనే   వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే పార్టీకి, ఎమ్మెల్యేల‌కు ఎలాంటి తాయిలాలు అందుతాయి. కేంద్రం ఎన్ని నిధులు విడుద‌ల చేస్తుంది అని స్ప‌ష్ట‌మైన భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ చేస్తున్న‌ట్లు టాక్ .టీఆర్ఎస్ లో హ‌రీష్ - కేటీఆర్ ల వ‌ర్గ పోరుతో త‌ల‌లు ప‌ట్టుకుంటున్న హ‌రీష్ రావు వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్యంగా మంతానాలు జ‌రుపుతోంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం విప‌రీతంగా ప్ర‌చారం చేస్తుంది. ఈటెల రాజేంద‌ర్ కు ఎంపీ సీటు, కాంగ్రెస్ నేత‌ల‌కు వారికి న‌చ్చిన పోర్టుఫోలియోలు ఇచ్చేలా ఒప్పందాలు జ‌రుపుతోంద‌ట‌. 
 
కాబ‌ట్టే కొంగ‌ర కొలాన్ వేదికగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్  స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌నేలా ప్ర‌చారం జ‌రిగినా కేంద్ర బీజేపీ తీరుతో ఎన్నిక‌ల‌పై త్వ‌ర‌లోనే రాజ‌కీయ‌నిర్ణ‌యం తీసుకుంటామ‌ని పేర్కొన‌డం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇవ్వ‌న్నీ త్వ‌ర‌లో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో చేర్చుతామ‌ని చెప్ప‌డం, చివ‌రికి ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీని త‌రిమికొట్టాల‌ని పిలుపునివ్వ‌డం ద్వారా ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించిన‌ట్ల‌యింది. నేరుగా ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి ఏమీ మాట్లాడకుండా దీనిపై నిర్ణ‌యం తీసుకునే అధికారం మంత్రివ‌ర్గం త‌న‌కు ఇచ్చింద‌ని చెప్పడం వ్యూహంలో భాగ‌మ‌ని తెలుస్తోంది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.