గిన్నిస్‌బుక్‌లో సీఎం కేసీఆర్ పేరు?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr guinness book
Updated:  2018-03-23 11:55:52

గిన్నిస్‌బుక్‌లో సీఎం కేసీఆర్ పేరు?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరును గిన్నిస్‌బుక్ రికార్డులోకి ఎక్కించాల‌ని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ 2018-2019 మైనార్టీ బ‌డ్జెట్‌ను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన మహమూద్ అలీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సంవ‌త్స‌రాల‌లో మైనార్టీల‌కు  బడ్జెట్ కేటాయింపులు, రెండేళ్ల‌లో 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను రికార్డుస్థాయిలో నెలకొల్పార‌ని అన్నారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్‌కు అభినంద‌న‌లు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న‌ తెలిపారు.
 
దేశంలో 25 శాతంక‌న్నా ఎక్కువ జ‌నాభా ఉన్న మైనార్టీ రాష్ట్రాలు కూడా, ఆయా రాష్ట్రాల్లో మైనార్టీల సంక్షేమానికి  కేటాయించ‌ని నిధుల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం కేటాయింద‌ని అన్నారు.... మైనార్టీల‌ విద్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించ‌డం వ‌ల్ల‌నే గ‌త బ‌డ్జెట్‌లో రూ.248 కోట్లు, ఇప్పుడు రూ.735 కోట్లు మైనార్టీలకు కేటాయించారని మహమూద్ అలీ తెలిపారు. 
 
సీఎం మైనారిటీ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో  అనేదానికి ఇదే నిద‌ర్శ‌నం అని ఉప‌ముఖ్య‌మంత్రి మహమూద్ అలీ తెలిపారు. మైనారిటి పిల్లలు ఇంత మంచి చదువులు చదువుతారని ఎవ‌రూ ఊహించి ఉండరని ఆయ‌న అన్నారు. అదే విధంగా ఉర్ధూ భాషను ప్రోత్సహించాల‌నే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ఉర్ధూ అకాడమీకి రూ.40 కోట్ల నిధులు కేటాయించార‌ని అన్నారు.
 
షాదీముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలో 87 వేల మంది పేద మైనారిటీ యువతులు లబ్దిపొందారని మహమూద్ అలీ తెలిపారు. పారిశ్రామికంగా మైనార్టీలు  అభివృద్ది చెంద‌డానికి టీ-ప్రైమ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి  దీనికి సంబందించిన నిధుల‌ను బడ్జెట్‌లో రూ.25 కోట్లను కేటాయించార‌ని ఆయ‌న తెలియచేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ‌లో ఉన్న ఖాళీల‌ను త్వ‌ర‌లో భ‌ర్తి చేస్తామ‌ని మహమూద్ అలీ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.