అప్పుడు అంద‌రి పార్టీ..ఇప్పుడు అడుక్కుతినే పార్టీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

mothkupalli narasimhulu
Updated:  2018-09-29 05:35:19

అప్పుడు అంద‌రి పార్టీ..ఇప్పుడు అడుక్కుతినే పార్టీ

మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు స్వ‌రం మారింది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే చాలు విరుచుకుప‌డే మోత్కుప‌ల్లి త‌న స్వ‌రం మార్చారు. ముంద‌స్తులో త‌న‌ని వాడుకుంటే ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌జిల్లా లో 12సీట్లు గెలిపించిపెడ‌తా. కేసీఆర్ త‌న మిత్రుడంటూ రూటు మార్చారు. అయితే దీనికి కార‌ణాలు లేక‌పోలేదని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 
 
25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చంద్ర‌బాబు ఆడిన వింత‌నాట‌కంలో బ‌లైపోయారు.  మోత్కుప‌ల్లి చిర‌కాల స్వ‌ప్నం గ‌వ‌ర్న‌ర్ పీఠాన్ని అధీష్టించ‌డం.  దీన్ని అలుసుగా తీసుకున్న చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచి ఊరిస్తూ వ‌చ్చారు. పీఎం మోడీ మ‌న స్నేహితుడే కాబ‌ట్టే ఏదో ఒక రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ ని చేస్తా. సిద్ధంగా ఉండూ అంటూ మున‌గ‌చెట్టు ఎక్కించారు. కానీ చంద్ర‌బాబు ఏం చేశారు. ప‌ట్టించుకోవ‌డం మానేశారు. సొంత‌నేతలే మోత్కుప‌ల్లిని టార్కెట్ చేసేలా ఉసిగొల్పారు. దీన్ని త‌ట్టుకోలేని మోత్కుప‌ల్లి అధిష్టానాన్ని ఎదిరించారు. బాబు నీచుడు నికుష్టుడంటూ విమ‌ర్శించారు. 
 
నాడు మ‌హానాడులో త‌న‌పై జ‌రిగిన అవ‌మానాన్ని త‌ట్టుకోలేని మోత్కుపల్లి అంద‌రిముందు ఎక‌రువు పెట్టాడు. బాబు నైజం ఎలాంటిదో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. దీంతో  చంద్రబాబు. తనకు చేసిన అన్యాయానికి చంద్రబాబు మనస్సాక్షే అతనికి బుద్ధి చెబుతుందని అన్నారు. తనను బాబు ఎందుకు తిట్టడం లేదని.. ఇతర నేతలెందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుంటున్నారు తప్ప, ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు మోత్కుపల్లి. హైదరాబాద్‌లో రెండు బిల్డింగులు కట్టి గొప్పలు చెప్పుకున్నాడని, అమరావతిలో కూడా రెండు బిల్డింగులు కట్టి గొప్పలు చెప్పుకుంటాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రధాని మోడీ దగ్గరకు 29సార్లు వెళ్లింది.. ఏపీ ప్రజల కోసం కాదని, అతని కేసుల మాఫీ కోసమేనని మోత్కుపల్లి చెప్పారు. ఇందుకోసం మోడీ కాళ్లు పట్టుకున్నారని అన్నారు.
 
 
ఈనేప‌థ్యంలో మోత్కుప‌ల్లి కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌నిచేయాల‌ని భావిస్తున్నామ‌నే సంకేతాల్ని పంపారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా కేసీఆర్ త‌నను వాడుకోవాలని, అలా వాడుకుంటే ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో అత్య‌దిక మెజారిటీస్థానాల్ని గెలుపొంది కానుక‌గా ఇస్తామ‌ని అన్నారు. 
 
కేసీఆర్‌ మిత్రుడు.. ఎన్నికల్లో తనను వాడుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12సీట్లు గెలిపించి చేతిలో పెడుతానని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మకుంటే మోసం చేశాడన్నారు. పార్టీలో తాను కేసీఆర్‌ కోసమే మాట్లాడానని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు వద్దని చెప్పానని పేర్కొన్నారు. అప్పుడు రాజకీయంగానే టీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించానే తప్ప.. తాను కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని.. అందరికి ఇచ్చేపార్టీగా చరిత్రగలది ప్రస్తుతం అడుక్కునే పార్టీగా మారిందని విమర్శించారు. ఇందుకు చంద్రబాబే కారణమని  ఆయనపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.