రేపే బాబుపై యుద్దం స్టార్ట్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-07-10 18:48:20

రేపే బాబుపై యుద్దం స్టార్ట్

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు కొద్ది కాలంగా ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుని టార్గెట్ చేస్తూ మీడియా స‌మ‌క్షంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఓడిపోవాల‌ని కోరుకుంటూ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి మెట్లు ఎక్కుతాన‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే 
 
అందులో భాగంగానే మోత్కుపల్లి నర్సింహులు ఈ రోజు తిరుప‌తికి బ‌య‌ల్దేరారు. తిరుప‌తిలో ఈ రోజు రాత్రంతా బ‌స చేసి ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి దేవుడుని దర్శించుకోనున్నారు. అయితే తాను ఆర్థికంగా రాజ‌కీయంగా బాగానే ఉన్నాన‌ని కానీ కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఓడిపోవాల‌నే ఉద్దేశ్యంతోనే కాలిన‌డ‌క చేస్తున్నాన‌ని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓడిపోతే త‌న‌కు అన్నిప‌ద‌వులు వ‌చ్చిన‌ట్లే అని మోత్కుపల్లి నర్సింహులు స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబును బొంద‌పెట్టాల‌ని వెంక‌టేశ్వ‌ర స్వామిని వేడుకుంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ద‌ళితుడు అయినందుకు చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను దూరం పెట్టార‌ని మోత్కుపల్లి నర్సింహులు విమ‌ర్శిలు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.