ఈ ప్ర‌శ్న‌కు బాబు స‌మాధానం చెప్తె రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-07-11 16:59:31

ఈ ప్ర‌శ్న‌కు బాబు స‌మాధానం చెప్తె రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిపోవాల‌ని కోరుకుంటూ తెలంగాణ‌ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ రోజు తిరుప‌తి మెట్లు ఎక్కారు. అయితే ఆయ‌న తిరుమ‌ల మెట్లు ఎక్క‌బోయే ముందు మీడియాతో మాట్లాడుతూ మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో చంద్ర‌బాబు నాయుడు రాజ్య‌స‌భ సీటును సుమారు 100 కోట్ల‌కు అమ్ముకున్న ఘ‌నత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి మాత్ర‌మే ద‌క్కుతంద‌ని  మోత్కుపల్లి నర్సింహులు విమ‌ర్శ‌లు చేశారు. 
 
తాను టీడీపీలో ఉన్న‌ప్పుడు ఏం అన్యాయం చేశానో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెల‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని మోత్కుపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అయితే ఇది ధ‌ర్మ‌పోరాట దీక్ష కాద‌ని అధ‌ర్మ‌పోరాట దీక్ష అని స్ప‌ష్టం చేశారు. కుట్ర‌రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన నాయ‌కుడు లేర‌ని అందుకే ఆయ‌న వైఖ‌రిని త‌ప్పుబ‌డుతూ వ‌చ్చేఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓడిపోవాల‌ని కోరుతూ తిరుమ‌ల మెట్లు ఎక్కుతున్నాన‌ని మోత్కుపల్లి నర్సింహులు స్ప‌ష్టం చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.