తెలంగాణ‌లో నేనుకూడా అక్క‌డనుంచే పోటీ చేస్తా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

mothkupalli
Updated:  2018-09-07 01:17:50

తెలంగాణ‌లో నేనుకూడా అక్క‌డనుంచే పోటీ చేస్తా

టీడీపీ బ‌హిష్రృత నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు తాజాగా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో హోరా హోరీగా సాగే ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తాను కూడా పోటీ చేస్తాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అయితే తానే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. 35 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న త‌ను లేరు నియోజ‌క‌వ‌ర్గంలో అనేక అభివృద్ది కార్య‌క్రమాలు చేశాన‌ని మోత్కుప‌ల్లి స్ప‌ష్టం చేశారు.
 
అందుకే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని అన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించి త‌న‌ను శాస‌న‌స‌భ‌కు పంపాల‌ని కోరారు. అంతేకాదు త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గానికి వ‌రాల వ‌ర్షం కురిపిస్తాన‌ని అన్నారు.
 
ఆ వ‌రాలు ఏంటంటే ఆలేరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు గోదావ‌రి జ‌లాల‌ను సాధించి స‌స్య‌శ్యామ‌లం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఈ నెల 17న యాద‌గిరిగుట్టలో ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నామ‌ని మోత్కుపల్లి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.