నాగం క్లారిటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-03-27 16:19:44

నాగం క్లారిటీ

సార్వ‌త్రిక  ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌మ‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది అనేదాని పై వ్యూహాలు ర‌చించుకుంటూ ముందుకు సాగుతున్నారు  రాజ‌కీయపార్టీ నాయకులు. అయితే ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిన విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌య‌స్- కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరు తీవ్ర స్థాయిలో కొన‌సాగుతోంది. దీని వ‌ల్ల‌ ఇత‌ర పార్టీలో నుంచి వ‌చ్చే రాజ‌కీయ నాయ‌కులు టీఆర్‌య‌స్ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విష‌యం తెలిసిందే.
 
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే అత్య‌ధికంగా ఉన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గ‌త కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో ఆయ‌న ఇటీవ‌ల బీజేపీకి రాజీనామా చేసి ఆశ్చ‌ర్యం క‌లిగించారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలోకి చేరాల‌నుకున్నా ఆ పార్టీలో ఉన్న కొంద‌రు నాయ‌కులు ఆయ‌న రాక‌ను  తిర‌స్క‌రిస్తున్నార‌ట, తాజాగా జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడారు.
 
ప్రాజెక్టులపేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు తమతప్పులను కప్పిపుచ్చు కునేందుకు విపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కోర్టు కేసుల కారణంగానే ఆలస్యమవుతున్నాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నదని నాగం జనార్దన్‌ రెడ్డి దుయ్యబట్టారు. కొత్త పార్టీలో చేరిక గురించి ప్రశ్నించగా కార్యకర్తల నిర్ణయం మేరకే వ్యవహరిస్తానని చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.