త‌న‌కు ఏమైనా అయితే కేసీఆర్ దే బాధ్య‌త ఆ పార్టీ నేత‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr
Updated:  2018-09-11 12:10:05

త‌న‌కు ఏమైనా అయితే కేసీఆర్ దే బాధ్య‌త ఆ పార్టీ నేత‌

తెలంగాణ రాష్ట్రం చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అస‌మ్మ‌తి తారా స్థాయికి చేరుకుంది. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్, బాల్క సుమ‌న్ కు సీటు కేటాయించ‌డంపై న‌ల్లాల ఓదేలు త‌న సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అంతేకాదు త‌న నివాసంలోనే నిర్భంధం లోకి వెళ్లారు. 24 గంట‌ల్లో కేసీఆర్ నుంచి స్పంద‌న రాక‌పోతే ఆ త‌ర్వాత జ‌రుగ‌బోయే ప‌రిణామాల‌కు ఆయ‌న‌దే బాధ్య‌త అని ఓదేలు హెచ్చ‌రిస్తున్నారు.
 
గతంలో వ‌రుస‌గా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు . తెలంగాణ‌ ఉద్య‌మం కాలం నాటినుంచి తాను కేసీఆర్ కు వెన్నంటి ఉన్నా కూడా త‌న‌కు సీటు కేటాయించ‌లేద‌ని త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇక ఆయ‌న‌తో పాటు వ‌రంగ‌ల్ అర్బ‌న్ ఎమ్మెల్యే కొండా సురేఖ‌ కూడా త‌న‌కు సీటు కేటాయించ‌క‌పోవ‌డంపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.
 
అంతేకాదు టీఆర్ఎస్ కు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఈ నెల ఆఖ‌రిలోపు ముఖ్య‌మంత్రి త‌మ విష‌యంలో స్ఫ‌ష్టత ఇవ్వాల‌ని లేక‌పోతే త‌న రాజ‌కీయ త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

షేర్ :