మొత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-20 11:58:54

మొత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్క‌ప‌ల్లి న‌ర‌సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ 22 వ వ‌ర్దంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఆయ‌న నివాళుల‌ర్పించారు. 

అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న   ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న  చేశారు.  ఎన్టీఆర్‌ ఘాట్‌ హైదరాబాద్‌లో ఉంది కావున,  దివంగత నేత ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ రావాల్సిందేనని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 

తెలుగుదేశం పార్టీని భుజాన ఎత్తుకొని పార్టీ కాపాడుకుందామన్న సహకరించే వారు లేరని ఆయన ఆవేద‌న వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ అంతరించిపోయి..  మనుగడే లేదనడం  చెప్పుకోవ‌డం కన్నా.... టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయటం మంచిదంటూ మోత్కుప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేశారు. 

టీడీపీని విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌తంగా ఈ స‌ల‌హా ఇస్తున్నాన‌ని మోత్కుప‌ల్లి పేర్కొన్నారు. ఎన్టీరామారావు వ‌ర్ధంతి నాడు మోత్కుప‌ల్లి చేసిన ఈ వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల్లో  చ‌ర్చ‌నీయాశంగా మారాయి. 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.