ముద్దు కృష్ణ‌మ నాయుడు మ‌ర‌ణానాకి కార‌ణం బాబే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-07-12 17:37:50

ముద్దు కృష్ణ‌మ నాయుడు మ‌ర‌ణానాకి కార‌ణం బాబే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని వ‌దిలి సింగ‌పూర్ కు వెళ్లిన‌ప్పుడు  నిన్నామొన్న బాగా వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని తెలంగాణ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు అన్నారు. ఈ రోజు తిరుప‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మ‌రోసారి ముఖ్య‌మంతి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉంటే రాష్ట్రం క‌రువు కాట‌కాల‌తో విల‌య‌తాండ‌వంతో అల్లాడుతుంద‌ని మోత్కుప‌ల్లి విమ‌ర్శ‌లు చేశారు. 
 
ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాలకు గతంలో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా క‌రువుతో అల్లాడిపోయింద‌ని విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు ఎక్క‌డ ఉంటే అక్క‌డ రాష్ట్రం మొత్తం విల‌యతాండ‌వం ఆడుతుంద‌ని మండిప‌డ్డారు.
 
చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే కేవ‌లం కాంట్రాక్ట‌ర్లు మాత్ర‌మే బాగుపడ్డారు త‌ప్ప సామాన్య ప్ర‌జ‌లు ఏవిధంగా బాగుప‌డ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అధికార బలంతో ముఖ్య‌మంత్రి మాల‌, మాదిగ కుల‌స్థులపై ఇష్టానుసారంగా మాట్లుడున్నార‌ని మోత్కుప‌ల్లి విమ‌ర్శించారు. గ‌తంలో చంద్ర‌బాబు మాదిగ‌న‌ని ప్ర‌చారం చేశారు. కానీ ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.
 
అంతేకాదు ఎన్టీఆర్ వెంట‌ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. అందులో భాగంగానే టీడీపీ ఇంచార్జ్ గాలిముద్దు కృష్ణ‌మ నాయుడు మ‌ర‌ణానికి కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ముద్దు కృష్ణ‌మ నాయుడు జ్వ‌రంతో చ‌నిపోలేద‌ని కేవలం చంద్ర‌బాబు వల్లే చ‌నిపోయార‌ని మోత్కుప‌ల్లి అన్నారు. చంద్ర‌బాబు నాయుడు జీవితంలో పాపాలు త‌ప్ప ఇంకేం చేయ‌డ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.