బ్రేకింగ్.. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా మ‌రో కొత్త పార్టీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr
Updated:  2018-10-09 10:32:58

బ్రేకింగ్.. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా మ‌రో కొత్త పార్టీ

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను గద్దె దించేందుకు మ‌హాకూట‌మికి పిలుపునిచ్చాయి. వారి పిలుపు మేర‌కు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌న్నీ ఏకమై మ‌హాకుట‌మిని ఏర్పాటు చేసుకున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ కూడా పోలింగ్, ఎన్నిక‌ల ఫలితాల‌ను డేట్ ఫిక్స్ చేయ‌డంతో రాజ‌కీయ నాయ‌కులు విస్రృత స్థాయిలో ప్ర‌చారం చేస్తూ ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
 
తాజాగా కేసీఆర్ కువ్య‌తిరేకంగా మ‌రో పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్ప‌టికి మ‌హాకూట‌మి ఆయ‌న‌ను ముప్పుతిప్ప‌లు పెడుతుంటే స‌డ‌న్ గా మ‌రో కొత్త‌పార్టీ రావ‌డంతో టీఆర్ఎస్ నాయ‌కులను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.  ప్రజాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ ను క‌లిసి ఆయ‌న ఆ త‌ర్వాత మీడియాతో మాట్ల‌డుతూ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు వ్య‌తిరేకంగా పోటీ చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ప్ర‌స్తుతం కేసీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో తాను పోటీ చేస్తాన‌ని గ‌ద్ద‌ర్ స్ప‌ష్టం చేశారు. తాను గ‌తంలో ఓటు హ‌క్కును గ‌జ్వేల్ స్థానంలోనే న‌మోదు చేయించుకున్నాను క‌నుక ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు ఓటు హ‌క్కు ఎంత విలువైన‌దో ప్ర‌జ‌లంద‌రికీ తెలియ‌జేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ళితులకు మూడు ఎక‌రాల భూమిని ఇస్తామ‌న్న కేసీఆర్ హామీ ఏమైంద‌ని గ‌ద్ద‌ర్ ప్ర‌శ్నించారు. అలాగే ఉద్యోగాలు, రెండు ప‌డ‌క‌గ‌దుల ఇళ్లు ఏమ‌య్యాయ‌ని నిల‌దీశారు. దీనిపై ప్ర‌జ‌లే నిర్ణ‌యం తీసుకుంటార‌ని అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.