Breaking News

హోమ్        న్యూస్


తెలంగాణ ఎమ్మెల్సీకి ఆన్ లైన్ షాక్

ఇప్ప‌టి వర‌కు సామాన్య ప్ర‌జ‌లు ఆన్ లైన్ మోస‌గాళ్ల చేతిలో చిక్కుకుని మోస‌పోయారు. ఇప్పుడు ఏకంగా ప్ర‌జాప్ర‌తినిధుల కూడా సైబ‌ర్ నేరాగాళ్ల బారిన ప‌డుతున్నారు.  తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ  శాస‌న‌మండలి స‌భ్యుడు రామ‌చంద‌ర్ రావుకు ఆన్ లైన్ మోస‌గాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఆయ‌న బ్యాంకు ఖాతాల నుండి సైబ‌ర్ నేర‌స్తులు ఏకంగా రూ.35 వేలు దోచేశారు. 

జ‌న‌వ‌రి ఓక‌టో తేదీన సాయంత్రం మూడు గంట‌ల స‌మ‌యంలో రెండు అకౌంట్లు నుండి ఈ డ‌బ్బులు క‌ట్ అయిన‌ట్లు రామ‌చందర్ రావుకు మెసేజ్ లు వ‌చ్చాయి. దీంతో  షాక్ కు గురైన స‌ద‌రు ఎమ్మెల్సీ  జ‌న‌వ‌రి మూడో తేదీన పోలీసుల‌కు తెలుప‌గా, కేసును న‌మోదు చేసుకున్న పోలీసులు  ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.