క‌విత‌కు అభినంద‌న‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-10 12:47:53

క‌విత‌కు అభినంద‌న‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్

అదునుచూసి చేయ‌డ‌మే రాజ‌కీయం అంటారు పెద్ద‌లు... స‌మ‌యం సంద‌ర్బం చ‌తుర‌త ఉన్న వారు చాలా మంది నాయ‌కులు పైకి వ‌చ్చారు... అయితే ప్ర‌శ్నించే పార్టీ అధినేత అదే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఎక్క‌డో పుస్త‌కంలో ఇదే చ‌దివి ఉంటారు.. అదే స్ట్రీమ్ లో ముందుకు వెళుతున్నారు ఎందుకు అంటే ఇందుకు ?
 
ఏపీలో క‌ర‌వు యాత్ర చేసి ముందుకు వెళుతున్న ప‌వ‌న్ తాజాగా కేంద్రం బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి బ‌రాబ‌రి మొండిచెయ్యి చూపించింది... దీంతో ప‌వ‌న్ కూడా ఉగ్ర‌రూపుడు అవుతాడు అనుకున్నారు అంద‌రూ... శాంతి రూపుడై జేఏసి అనే కొత్త జాబ్ ను నెత్తిన పెట్టుకున్నాడు.
 
ఇక ఇదే స‌మ‌యంలో బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఏపీకి న్యాయం చేయాలి  అంటూ ఏపీకి చెందిన ఆల్ పార్టీ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నినాదాలు చేశారు డిమాండ్ చేశారు.. ఇదే వ‌రుస‌లో తెలంగాణ ఎంపీ కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఏపీకి  విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కోన్న అన్ని అంశాల‌ను తీర్చాలి అని న్యాయం చేయాలి అని కోరారు.. గులాబీ పార్టీ గుబాలింపు ఏపీ అంతా విక‌సించి వైర‌ల్ అయింది.. ఆమెకు అనేక కామెంట్లు, అభినంద‌న‌లు, ప్ర‌సంస‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి... ఎంతైనా ఉద్య‌మ స్ఫూర్తి ఆమెకు తెలుసు అని సీనియ‌ర్లు కూడా కామెంట్ చేశారు.
 
ఇక పార్లమెంట్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మద్దతిచ్చినందుకు క‌విత‌కు కృత‌జ్ఞ‌లు తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని లోక్‌సభలో మద్దతు తెలిపిన తెరాస ఎంపీ, !! చెల్లెలు కవిత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు.. ప‌వ‌న్ ట్వీట్ భ‌లే వైర‌ల్ అవుతోంది  సోష‌ల్ మీడియాలో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.