లోఫ‌ర్స్, లుచ్చాగాళ్లు మీ అయ్య కేటీఆర్- పొన్నం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ktr and ponnam prabhakar
Updated:  2018-08-16 05:45:48

లోఫ‌ర్స్, లుచ్చాగాళ్లు మీ అయ్య కేటీఆర్- పొన్నం

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుత త‌రుణంలో ఇటు ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా రాజ‌కీయాలు హాట్ హాట్‌ సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష, అధికార నాయ‌కులు ఎంత‌లా విమ‌ర్శించుకుంటున్నారు అంటే చివ‌ర‌కు వ్య‌క్తిగ‌త జీవితాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు.
 
తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు. తెలుగు రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో ఇక్క‌డికి వ‌చ్చి పార్టీ కండువా క‌ప్పుకోవ‌డంతో మ‌ద‌మెక్కిన ఆంబోతుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
గ‌తంలో అమెరికాలో చిప్ప‌లు క‌డిగిన కేటీఆర్ ఇప్పుడు అధికార బ‌లంతో మంత్రి అయి విమ‌ర్శ‌లు చేయడం విడ్డూరంగా ఉంద‌ని పొన్నం ఆరోపించారు. కేటీఆర్ చ‌రిత్ర‌ను బ‌య‌ట పెడితే రాష్ట్రంలో తిరగ‌లేర‌ని స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తాను అన్ని మీడియా ద్వారా బ‌య‌ట పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. వాస్త‌వాల‌ను ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాలాని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాములు దూరినట్లు మ‌ధ్య‌లో వ‌చ్చిన లుచ్చాగాళ్లు ఎవ‌రు..! మీ అయ్య కేసీఆర్ కాదా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు పొన్నం. జ‌న్మ‌నిచ్చిన కాంగ్రెస్ పార్టీని మ‌రిచిపోకూడ‌దని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాష్ట్రంలో సుమారు ఆరు సార్లు స‌ర్వే నిర్వ‌హిస్తే ఆ స‌ర్వేలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంద‌ని తేల‌డంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ద‌ప‌డుతున్నార‌ని పొన్నం మండిప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాను రెండు ముక్క‌లుగా చేసిన వారు లోఫ‌ర్స్, లుచ్చాగాళ్లు అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు పొన్నం.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.