పోసాని సంచ‌ల‌న నిర్ణ‌యం తెలంగాణ‌ ఎన్నికల్లో నాఓటు ఆ పార్టీకే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

posani krishna murali
Updated:  2018-11-03 04:21:09

పోసాని సంచ‌ల‌న నిర్ణ‌యం తెలంగాణ‌ ఎన్నికల్లో నాఓటు ఆ పార్టీకే

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తుంది. అయితే ఈ ప్ర‌చారంలో భాగంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళిని త‌న నివాసంలో క‌లిసి ఆయ‌న మ‌ద్ద‌తును కోరారు.
 
ఈ సంద‌ర్భంగా పోసాని మాట్లాడుతూ తాను ఖ‌చ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌క్కువ స‌మ‌యంలో అనేక అభివృద్ది కార్య‌క్రమాలు చేప‌ట్టిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ద‌క్క‌తుందని పోసాని అన్నారు. దేశంలో ఉన్న గొప్ప ముఖ్య‌మంత్రుల‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఒక‌ర‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 
 
దేశ‌చ‌రిత్ర‌లోనే చంద్ర‌బాబు నాయుడులాంటి మోసగాడు మ‌రొక‌రు ఉండ‌రని వ్యాఖ్యానించారు పోసాని. ఆయ‌న నిజం చెబితే రాష్ట్ర ప్ర‌జ‌లు ముక్క‌లు ముక్కలుగా చేస్తార‌నే ఉద్దేశంతో చ‌చ్చినా కూడా నిజాలు చెప్ప‌ర‌ని అన్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు చెప్పే మాట‌ల‌ను హైద‌రాబాద్ లో ఉంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు న‌మ్మ‌కూడ‌ద‌ని ఆయ‌