మిర్యాలగూడ ఏమ్మెల్యే గా ప్రణయ్అమృత ...

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

pranayamrutha
Updated:  2018-09-19 03:01:12

మిర్యాలగూడ ఏమ్మెల్యే గా ప్రణయ్అమృత ...

భువ‌న‌గిరి, క‌ర్నూలు, కాకినాడ‌,క‌రీంన‌గ‌ర్ మారుతున్న ప్రాంతాలే త‌ప్ప ఆగుతున్న ప్రాణాలు లేవు. అదే కుల‌దుర‌హాంకారానికి ముడిప‌డి ఉంది ఓ అమృత క‌థ‌. ఆమెక‌థ‌లోనూ కులం ఉంది. ఆక‌థ‌లోనూ ప్రేముంది.
 
ఆక‌థ‌లోనూ హ‌త్యుంది  
ఓ కుల‌మా నీకు స‌లామ్. క‌న్నకూతురు కంటే నువ్విచ్చిన ప‌రువే ఎక్కువ‌..!
నిండు జీవితాల‌కంటే నీదుర‌హంకార‌మే మ‌క్కువ‌.
మ‌రోసారి నిరూపించావ్ నీ కాఠిన్యాన్ని
ఇంకోసారి చ‌విచూపించావ్..ప్రాణం కంటే కులమే ఎక్కువ‌ని
అందుకే కుల‌మా..నీకు స‌లామ్..!
ప్రేమిస్తే త‌ప్పా అనిఅడుగుతోంది అమృతా..ఏం చెబుతావ్..?
ఆస్తిపాస్తుల‌కంటే ప్రేమించిన వాడే కావాల‌నుకున్న ఆమెను ఎలా ఓదార్చుతావ్..?
క‌డుపులో పెరుగుతున్న పిండం. రేపు నాతండ్రి ఏడ‌ని ప్ర‌శ్నిస్తే ఎవ‌ర్ని చూపిస్తావ్..?
క‌నిపించ‌ని నువ్వు ఎంత‌కైనా తెగించ‌గ‌ల‌వ‌ని నిరూపించినందుకు..నీవ‌ల్ల ఎన్ని ఉదంతాలు ..దురాగ‌తాలు జ‌రిగినా..క‌ళ్లు తెర‌వ‌కుండా అంత‌కంత‌కూ గంత‌లు క‌డుతున్నందుకు ఓ కుల‌మా నీకు స‌లాం..!
 
అమృత - ప్ర‌ణ‌య్ ఇద్ద‌రు మిర్యాల గూడా వాసులు. హైస్కూల్ ఏజ్ నుంచే ఇద్ద‌రు ఫ్రెండ్స్. అమృత కంటే ప్ర‌ణ‌య్ ఓ సంవ‌త్స‌రం సీనియ‌ర్. అప్ప‌ట్లో ఆ చిగురించిన స్నేహం వ‌య‌సుతోపాటే పెరిగి పెద్ద‌దైంది. బాల్య స్నేహితులు ప్రేమికుల‌య్యారు. క‌లిసి బ్ర‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి వీళ్ల స్నేహం ప్రేమ వ్య‌వ‌హారం పెద్ద‌ల‌కు తెలుసు. 
 
ప్ర‌ణ‌య్ ను క‌లిస్తే చాలు బాబాయ్ శ్ర‌వ‌ణ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యేవాడు. చేతికి ఏది అందితే అది చావ‌బాదేవాడు. ఫోన్లు లాగేసుకున్నారు. సిమ్ కార్డ్ లు డీ యాక్టీవేట్ చేయించారు. అటు ప్ర‌ణ‌య్ కు ఇటు అమృత‌కు వార్నింగ్ లిచ్చి ఎంత‌దూరం పెట్టాలో అంత‌దూరం పెట్టారు. కానీ ఒక‌రినొక‌రు మ‌రిచిపోలేక ఏవో ప్ర‌య‌త్నాల ద్వారా కాంటాక్ట్ లోకి వ‌చ్చారు. 2011లో ఒక‌రినొక‌రు ప్ర‌పోజ్ చేసుకున్నారు. 2018వ‌ర‌కు పెద్ద‌ల ఆమోదం కోసం ఎదురు చూశారు. చివ‌రికి ఆర్య‌స‌మాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అమృత - ప్ర‌ణ‌య్ లు పెళ్లిత‌రువాత ఎలా ఉండాలో చెప్ప‌డానికి వాళ్ల అన్యోన‌తకు వాళ్ల ప్రీ వెడ్డింగ్ వీడియోనే నిద‌ర్శనం.
 
అనుబంధానికి అంద‌మైన లోకేష‌న్ల‌ను జ‌త‌చేసి మురిసిపోయారు. 2018 జ‌న‌వ‌రిలో పెళ్లి చేసుకున్న ఈజంట‌కు ఒకే ఒక్క‌బాధ పుట్టింటివారు క‌లిసిరాలేద‌ని. వాళ్ల ఆమోదం ద‌క్క‌లేద‌ని.అంత‌కు మించి మ‌రో ఇబ్బంది లేదు. అత్తింట్లో చాలా హ్యాపీగా ఉండేదాన్న‌ని అంటోంది అమృత‌. ప్ర‌ణయ్ కంటికి రెప్ప‌లా చూసుకునేవాడ‌ని గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఆనందంలోపే మ‌రోతీపి క‌బురు. అమృత ప్రెగ్నెంట్.ఐదోనెల వ‌చ్చింది ఆమెను కంటికి రెప్ప‌లా చూసుకుంటూ వ‌చ్చాడు. 
 
సెప్టెంబ‌ర్ 14 అమృత హెల్త్ చెక‌ప్ కోసం జ్యోతి ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చాడు ప్ర‌ణ‌య్. అంతా స‌జావుగా ఉంద‌న్న ఆనందంతో ఫ్యూచ‌ర్ గురించి మాట్లాడుకుంటూ భ‌య‌ట‌కు అడుగేశారు. గేటుదాటారో లేదో. అప్ప‌టి వ‌ర‌కు కాపుకాసిన ఓ వ్య‌క్తి వెన‌క నుంచి త‌ల‌మెడ వేరుశ‌నగ క‌త్తితో వేటు వేశాడు. అంతే  గిజ‌గిజాకొట్టుకుంటూ అక్కడే కుప్ప‌కూలిపోయాడు ప్ర‌ణ‌య్.
 
అమృత - ప్ర‌ణ‌య్ ల ప్రేమ బంధం నెల‌ల‌దో, రోజుల‌తో కాదు ఏళ్ల‌త‌ర‌బ‌డి కొన‌సాగింది. ఒక‌రంటే ఒక‌రు పెళ్లి చేసుకున్నారు. కాబ‌ట్టే పెళ్లిదాకా వెళ్లారు. కానీ అన్నేళ్ల బంధం ఆ తండ్రికి న‌చ్చ‌లేదు. రూ. కోటిరూపాయ‌ల సుఫారి ఇచ్చి మ‌రీ అల్లుడిని దారుణంగా హ‌త్య చేయించాడు. ఈ దారుణహ‌త్య‌పై కేసున‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. వ‌ర్ణ‌బేధంతోనే తండ్రిమారుతిరావు అల్లుడు ప్ర‌ణ‌య్ ని హ‌త్య చేయించాడ‌ని తేలింది. ఓ భర్తను పోగొట్టుకుని వేదనాభరిత స్థితిలో వున్న అభాగిని అమృత చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయం అలుముకుంది. 
 
ప్ర‌ణ‌య్ హ‌త్య‌కేసులో రాజ‌కీయ‌నేత‌ల హ‌స్తం ఉంద‌నే నేప‌థ్యంలో లోకల్ కాంగ్రెస్ లీడర్ కరీంని పార్టీ నుంచి తప్పించేశాం అంటూ జానారెడ్డి ప్రకటించారు.  బహుజన ఫ్రంట్ నేత, సామాజిక  శాస్త్రవేత్త  కంచె ఐలయ్య, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో పాటు మరికొంతమంది నాయకులు ఆమెని భుజం తట్టి ధైర్యం చెప్పారు. అక్కడితో ఆగకుండా.. ఈమెను కుల వ్యవస్థ విధ్వంసానికి దిక్సూచిలా చూడాలి. ఒక దళితుడ్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఆమె పడిన కష్టాలకు ఉపశమనం కలిగించాలి. మిర్యాలగూడ నుంచి ఆమెను ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపుదాం.. ఇందుకోసం అన్ని పార్టీలూ అభ్యర్థుల్ని పెట్టకుండా ఏకగ్రీవానికి తోడ్పడాలి..  అంటూ పిలుపునిచ్చారు కంచె ఐలయ్య. ఈ ప్రతిపాదనపై ప‌లువురు మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.