టీడీపీ పొత్తుపై ర‌ఘువీరా రెడ్డి క్లారిటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

raghu veera reddy
Updated:  2018-08-20 05:56:06

టీడీపీ పొత్తుపై ర‌ఘువీరా రెడ్డి క్లారిటీ

2019లో హోరా హోరీగా జ‌రుగ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవ‌ల‌నే దానిపై ఏపీ సీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాల‌నే దానిపై పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిర్ణ‌యిస్తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఏ పార్టీతో పొత్తు పెట్టుకొమంటే తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామ‌ని ర‌ఘువీరా రెడ్డి తెలిపారు. 
 
త‌మ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి వ్య‌తిరేకంగా ఉన్న బీజేపీకి తాము వ్య‌తిరేక శ‌క్తులుగా మారుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వ‌స్తున్నంద‌ని అనుకున్నాన‌ని కానీ చివ‌రి నిమిషంలో ఓట్లు తారు మారు అవ్వ‌డంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని ర‌ఘువీరా రెడ్డి గుర్తు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని టీడీపీ బీజేపీ వైఫ‌ల్యాల‌పై ప్ర‌తీ ఇంటింట తిరిగి తాము ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.