తెలంగాణ‌కు బంపర్ ఆఫ‌ర్ - రాహుల్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

rahul gandhi
Updated:  2018-08-13 05:24:27

తెలంగాణ‌కు బంపర్ ఆఫ‌ర్ - రాహుల్

ప్ర‌ధాని మోడీ గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా 15 మంది పారిశ్రామిక‌ వేత్త‌ల‌కు సుమారు రెండున్నర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను రుణ‌మాఫీ చేశార‌ని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈరోజు శంషాబాద్ క‌న్వెన్ష‌న్ హాల్లో ఏర్పాటు చేసిన మ‌హిళా స‌హాయ బృందాల‌తో మాట్లాడుతూ, ప్ర‌ధాని మోడీ హాయంలో కేవ‌లం పారిశ్రామిక వేత్త‌ల‌కు మాత్ర‌మే రుణమాఫీ అవుతుంద‌ని, రైతుల‌కు,మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ కాలేద‌ని ఆయ‌న డిప‌డ్డారు..
 
స‌భ‌లో రాహుల్ ఇంకా ఏమ‌ని మాట్లాడారంటే..
 
- మోడీ ప్ర‌భుత్వం సామాన్యుల‌కు చేసింది ఏమి లేదు.
- మ‌హిళ‌లు ఎద‌గాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.
- జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ టాక్స్ అని ప్ర‌జ‌లను ప్ర‌భుత్వం దోచుకున్న టాక్స్.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు చిన్న వ్యాపారుల‌కు రుణాల‌ను ఇస్తుంది.
- ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం.
- క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ పార్టీ 30 వేల కోట్లు రైతుల రుణ‌మాఫి చేసింది.
- 2019 ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లో కుటుంబ ప‌రిపాల‌న సాగుతోంది.