టి న్యూస్ సంతోష్ కు రాజ్య‌స‌భ టికెట్ ఫిక్స్‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

t news santosh image
Updated:  2018-03-09 10:42:27

టి న్యూస్ సంతోష్ కు రాజ్య‌స‌భ టికెట్ ఫిక్స్‌

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రావ‌డంతో రాజకీయ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న మూడు రాజ్య‌స‌భ సీట్ల‌కు టీఆర్‌య‌స్ పార్టీ అభ్య‌ర్థుల‌ను సిద్దం చేస్తోంది. ఇప్ప‌టికే  రెండు సీట్లకు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
అందులో మొదటి సీటు టి.న్యూస్ యండి - టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ కు ఖరారైనట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. రెండో రాజ్యసభ సీటు యాదవులకు కేటాయిస్తున్న‌ట్లు కేసీఆర్ ప‌లు సంద‌ర్బాల్లో వెల్ల‌డించారు.  దాని కోసం యాద‌వ వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మ‌రో సీటు  ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల  సమాచారం.
 
మూడో సీటు ఏ వ‌ర్గానికి కేటాయిస్తార‌నే విష‌యం పై ఉత్కంట రేపుతోంది.  ఇక రాజ్య‌స‌భ సీటును టి న్యూస్ సంతోష్‌కు కేటాయించ‌డం పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమ‌ర్శిస్తోంది. తెలంగాణాకు ఏమి సేవ చేశాడ‌ని సంతోష్ కు అవ‌కాశం ఇస్తున్నారు అని కారు పార్టీని  ప్ర‌శ్నించారు కాంగ్రెస్ నాయ‌కులు. తెలంగాణ రాష్ట్రం కోసం అమ‌రులైన కుటుంబాల‌లో ఒక‌రికి  రాజ్య‌స‌భ‌కు సీటు ఇచ్చి, పెద్ద‌ల స‌భకు వారిని ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.