పోలీసుల‌పై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-05 06:29:37

పోలీసుల‌పై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపిన‌ బొడ్డుపల్లి శ్రీనివాస్ హ‌త్య తెలిసిందే. బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాపసభ ఆదివారం నల్లగొండ బైపాస్‌ రోడ్డులో సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, జైపాల్‌రెడ్డి, ఉత్తమ్‌, జానారెడ్డి ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...  శ్రీనివాస్  హత్య కేసును పొలీసులు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వుతామ‌న్న భ‌యంతోనే హ‌త్య రాజకీయాలు చేయిస్తున్నార‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం పై ధ్వ‌జం ఎత్తారు రేవంత్.  ఎమ్మెల్యే వేముల వీరేశం బంధువులు రంజిత్‌, సుధీర్‌ నిందితులతో సంభాషించిన ఫోన్‌ కాల్‌డేటాను ఆధారంగా చేసుకుని విచారణ చేయాలని పోలీసులకు విన్న‌వించినా  పట్టించుకోకుండా.... హత్యను మిర్చీ బండి పంచాయితీగా చిత్రీకరించారని రేవంత్ మండిప‌డ్డారు.
 
కేసీఆర్‌ ఒత్తిడితో శ్రీను హత్య కేసును స‌మ‌గ్రంగా విచార‌ణ చేయ‌కుండా నిర్వీర్యం చేసిన ఎస్పీ శ్రీనివాసరావును గుడ్డలూడదీసే రోజులు ముందున్నాయని అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశంను న‌ల్ల‌గొండ క్లాక్ ట‌వ‌ర్ ద‌గ్గ‌ర గుడ్డ‌లూడ‌దీసి కొడితే నిజాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని,  మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎం కేసీఆర్ కూడా ఈ కేసులో దోషులుగా తేలుతారని అన్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.