ప‌వ‌న్ కు రేవంత్ రెడ్డి కౌంట‌ర్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-26 12:53:48

ప‌వ‌న్ కు రేవంత్ రెడ్డి కౌంట‌ర్

తెలంగాణ రాజ‌కీయం కాస్త వార్త‌ల్లో నిలుస్తోంది.. ఓ పక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో దూసుకుపోవ‌డం మ‌రో ప‌క్క టీఆర్ ఎస్ పై కాంగ్రెస్ కేడ‌ర్ విషం చిమ్మ‌డం చూస్తూనే ఉన్నాం.. ఇటు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, అధికార పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్న విష‌యం తెలిసిందే.. తెలంగాణ‌లో రాజ‌కీయ యాత్ర మొద‌లుపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఇటు కాంగ్రెస్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌ను స్టార్‌ సీఎం అని పొగిడిన పవన్‌ది మేకప్, పాకప్‌ మధ్యలో జరిగే షూటింగ్‌ వంటిదే తెలంగాణ టూర్‌ అని ఎద్దేవా చేశారు... కేసీఆర్ నిజ‌మైన తెలంగాణ వాది అయితే అసెంబ్లీ సెగ్మెంట్ల పున‌ర్విభ‌జ‌న‌ను అడ్డుకోవాలి అని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్, క‌డియం శ్రీహ‌రి, హ‌రీశ్ రావు వంటివారిని ఎంపీలుగా పోటీ చేయించాలని ఆలోచిస్తున్నార‌ని, వీరు అంద‌రూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయ‌ర‌ని... కావాల‌నే కేసీఆర్ త‌న వార‌సుడు అయిన కేటీఆర్ కు రాజ‌కీయంగా రెడ్ కార్పెట్ ప‌రిచేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ లో కేవ‌లం కేసీఆర్ కేటీఆర్ మాత్ర‌మే సంతృప్తిగా ఉన్నారు అని ఆయ‌న మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.