కోదండ‌రామ్ తో రేవంత్ రెడ్డి భేటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-15 12:08:12

కోదండ‌రామ్ తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ ను కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కలిశారు. కోదండరామ్ నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా తన నివాసంలో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా కోదండరామ్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు స‌మాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం అందుతుంది.
 
కాగా త్వరలోనే కోదండరామ్ ఓ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య భేటీ అమిత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి మధ్య భేటీకి సంబంధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోదండరామ్ తో మర్యాదపూర్వకంగా మాత్రమే భేటీ అయ్యానని ఆయన వివరించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.