రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-15 03:42:31

రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు పోందిన  కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వ‌ర‌లో పాద‌యాత్రకు శ్రీకారం చుట్ట‌నున్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు స‌మాచారం. వికారాబాద్‌-కృష్ణా రైల్వేలైన్‌, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపుతో పాటు పలుడిమాండ్ల సాధనకు కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 120 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. బంరాస్‌ పేట, పరిగి,వికారాబాద్‌, మన్నెగూడ, చేవేళ్ల, మెయినాబాద్‌ మీదుగా ఈ యాత్ర సాగునుంది.
 
కొడంగల్‌–హైదరాబాద్‌ మధ్య దూరం 120 కి.మీ.  ఉంటుంది. రోజూ 15 కి.మీ. పాదయాత్ర చేసే అవకాశముంది. కొడంగల్, బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌ మీదుగా వికారాబాద్‌ చేరుకుంటారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి మన్నెగూడ, రంగారెడ్డి జిల్లాలోని చిట్టెంపల్లిచౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకునే అవకాశముంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.